News October 7, 2025

‘న్యూ ఇండియా పార్టీ’కి షోకాజ్ నోటీస్ జారీ: కలెక్టర్

image

ఆడిట్ రిపోర్టులు సమర్పించకపోవడంతో న్యూ ఇండియా పార్టీకి షోకాజ్ నోటీసు జారీ చేసినట్లు PDPL జిల్లా ఎన్నికల అధికారి కోయ శ్రీ హర్ష తెలిపారు. 2021- 24 ఏడాదులకు చెందిన ఆడిట్ అకౌంట్స్‌ అందజేయలేదని, ప్రజాప్రతినిధి చట్టం సెక్షన్ 29ఏ ప్రకారం ఇది తప్పనిసరని పేర్కొన్నారు. నిర్దిష్ట వ్యవధిలో సమాధానం ఇవ్వకపోతే, కేంద్ర ఎన్నికల సంఘం మార్గదర్శకాలకు అనుగుణంగా గుర్తింపు రద్దు వరకు చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.

Similar News

News October 7, 2025

HYD: TGSRTC‌లో డ్రైవర్లు కావలెను

image

వాయు కాలుష్య నివారణలో భాగంగా సిటీలో ప్రభుత్వం ఎలక్ట్రిక్ బస్సులు ప్రవేశపెట్టింది. దశలవారీగా కొత్త ఎలక్ట్రిక్ బస్సులు ప్రజలకు అందుబాటులోకి వస్తున్నాయి. ఈ గ్రీన్ బస్సులను నడిపేందుకు TGSRTC డ్రైవర్ల నియామకం చేపట్టింది. ఆసక్తిగలవారు హెవీ డ్రైవింగ్ లైసెన్స్ డాక్యుమెంట్స్‌తో నేరుగా రాణిగంజ్ బస్ డిపో నందు జరిగే రిక్రూట్మెంట్ డ్రైవ్‌లో పాల్గొనాలని అధికారులు సూచించారు.
SHARE IT

News October 7, 2025

సీనియర్ నేతలతో సీఎం రేవంత్ సుదీర్ఘ చర్చ

image

TG: జూబ్లీహిల్స్‌లోని తన నివాసంలో కాంగ్రెస్ సీనియర్ నేతలతో సీఎం రేవంత్ రెడ్డి సమావేశం సుదీర్ఘంగా కొనసాగుతోంది. బీసీ రిజర్వేషన్లపై రేపు హైకోర్టులో తీర్పు వ్యతిరేకంగా వస్తే ఎలా ముందుకు వెళ్లాలనే దానిపై చర్చిస్తున్నట్లు సమాచారం. అటు జూబ్లీహిల్స్ ఉపఎన్నిక అభ్యర్థి ఎంపికపైనా సీఎం సమాలోచనలు జరుపుతున్నారు.

News October 7, 2025

ANU పరిధిలో సప్లమెంటరీ ఫలితాలు విడుదల

image

ANU పరిధిలో జులై 2025లో నిర్వహించిన పీజీ 2వ సెమిస్టర్ రెగ్యులర్, B.TECH సప్లమెంటరీ ఫలితాలను మంగళవారం పరీక్షల నిర్వహణ అధికారి ఆలపాటి శివప్రసాదరావు విడుదల చేశారు. పీజీ మాస్టర్ ఆఫ్ సోషల్ వర్క్ 84.62%, B.TECH 3&4 మొదటి సెమిస్టర్ లోని సప్లమెంటరీ ఫలితాలలో 65.91% విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారన్నారు. రీవాల్యుయేషన్ కి అక్టోబర్ 17లోపు ఒక్కొక్క సబ్జెక్ట్‌కు రూ.2,070 చెల్లించాలన్నారు.