News October 7, 2025

BREAKING: నల్గొండలో ఇంటర్ విద్యార్థి దారుణ హత్య

image

నల్గొండ జిల్లా కేంద్రంలో ఇంటర్‌ విద్యార్థిని లావణ్య దారుణ హత్యకు గురికావడం తీవ్ర కలకలం రేపింది. డైట్ కాలేజీ సమీపంలో ఆమె మృతదేహం లభ్యం కావడంతో ఉలికిపాటుకు గురిచేసింది. ప్రేమ వ్యవహారమే కారణమని అనుమానిస్తున్న పోలీసులు, నిందితుడైన ట్రాక్టర్‌ డ్రైవర్‌ కృష్ణ గౌడ్‌ను వెంటనే అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

Similar News

News March 15, 2026

అలర్ట్.. ‘జిల్లాలో అక్కడ 144 సెక్షన్’

image

పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమల్లో ఉంటుందని, జిరాక్స్ సెంటర్లు మూసి వేస్తున్నట్లు మార్కాపురం జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు తెలిపారు. పరీక్షా కేంద్రాల వద్ద ఇన్విజిలేటర్లు తప్ప ఇతర సిబ్బంది ఎవరూ ఉండకూడదని అన్నారు. పరీక్షా నియమ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని, ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పరీక్షా కేంద్రాల వద్ద పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేశామన్నారు.

News March 15, 2026

‘భీష్మ ప్రతిజ్ఞ’ అంటే ఏమిటి?

image

ఎన్ని ఆటంకాలు ఎదురైనా ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండేవాళ్ల గురించి చెప్పే సందర్భంలో ‘భీష్మ ప్రతిజ్ఞ’ నానుడిని వాడతారు. భారతంలో భీష్ముడి అసలు పేరు దేవవ్రతుడు. అతని తండ్రి శంతనుడు దాశరాజు కుమార్తె సత్యవతిని రెండో వివాహం చేసుకోవాలనుకుంటాడు. తన కూతురి కొడుకే రాజు కావాలని దాశరాజు కోరగా తండ్రి ఆనందం కోసం దేవవ్రతుడు అంగీకరించి ఆజన్మ బ్రహ్మచారిగా ఉండిపోతారు. అందుకే ఆయనకు భీష్ముడిగా పేరు వచ్చింది.
<<-se>>#EPICSAYINGS<<>>

News March 15, 2026

పుట్టపర్తిలో అధికారులతో కలెక్టర్ సమీక్ష

image

పుట్టపర్తి కలెక్టరేట్‌లోని మినీ కాన్ఫరెన్స్ హాల్‌లో అధికారులతో కలెక్టర్ శ్యాంప్రసాద్ ఆదివారం సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. జిల్లాలో మంజూరైన 4,923 వ్యక్తిగత మరుగుదొడ్లలో 3,725 పనులు పూర్తయ్యాయని, మిగిలినవాటిని త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు. వేసవి తాగునీటి ఎద్దడి నివారణకు రూ.299.37 లక్షలతో ప్రణాళికలు సిద్ధం చేశామని, ప్రజలకు తాగునీటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని తెలిపారు.