News October 7, 2025
HYD: హెచ్ఎండీఏకు లాస్ట్ ఛాన్స్ ఇచ్చిన హైకోర్టు

గోషామహల్ స్టేడియంలో ఉస్మానియా ఆస్పత్రి భవన నిర్మాణాలకు అనుమతిస్తూ గతంలో ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రాము అనే వ్యక్తి దీనిని వ్యతిరేకిస్తూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అయితే కౌంటర్ దాఖలుకు హెచ్ఎండీఏ పలు వాయిదాలు తీసుకుంది. దీంతో హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేస్తూ లాస్ట్ ఛాన్స్‌గా రెండు వారాలు గడువు ఇచ్చింది. ఈలోపు కౌంటర్ దాఖలు చేయకపోతే జరిమానా విధిస్తామని హెచ్చరించింది.
Similar News
News March 8, 2026
ఏలూరు: కిడ్నాప్ కలకలం.. రక్షించిన పోలీసులు

చింతలపూడి మండలం వెలగలపల్లిలో శనివారం మహిళ కిడ్నాప్ కలకలం రేపింది. గ్రామానికి చెందిన కర్రీ నాగసత్య వరలక్ష్మిని వ్యక్తిగత కక్షలు, అనుమానాలతో గుర్తుతెలియని దుండగులు కిడ్నాప్ చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు సీఐ క్రాంతి కుమార్ ఆధ్వర్యంలో ప్రత్యేక బృందాలుగా ఏర్పడి సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి గంటల వ్యవధిలోనే వరలక్ష్మి ఆచూకీని కనుగొన్నారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు.
News March 8, 2026
NZB: పెరిగిన గ్యాస్ ధరలు.. జిల్లా ప్రజలపై రూ.కోటి భారం

పెరిగిన వంట గ్యాస్ సిలెండర్ల రేటుతో నిజామాబాద్ జిల్లా ప్రజలపై రూ.కోటి వరకు భారం పడనుంది. జిల్లాలో 5,81,769 గ్యాస్ కనెక్షన్లు ఉండగా 42 గ్యాస్ ఏజెన్సీల ద్వారా సిలిండర్లు సరఫరా అవుతున్నాయి. ప్రతినెలా సగటున 1.50 లక్షల వరకు సిలిండర్ల వినియోగం అవుతున్నట్లు గ్యాస్ ఏజెన్సీల నిర్వాహకులు తెలిపారు. ఈ క్రమంలో గృహ వినియోగ సిలెండర్‌పై రూ.60 పెరగడంతో పేద, మధ్య తరగతి వర్గాల ప్రజలకు ఆర్థిక భారం కానుంది.
News March 8, 2026
మహిళా సాధికారతకు ఆసిఫాబాద్ నిదర్శనం

ASF జిల్లాలో మహిళలు అన్ని రంగాల్లో తమ సత్తా చాటుతున్నారు. పురుషులతో సమానంగా ముందుకు సాగుతూ కీలక బాధ్యతలను సమర్థంగా నిర్వహిస్తున్నారు. జిల్లాలో కలెక్టర్ హరిత, ఎస్పీ నితిక పంత్ వంటి ఉన్నత పదవుల్లో మహిళలు సేవలందిస్తుండగా, రాజకీయ రంగంలో ఎమ్మెల్యే కోవలక్ష్మీ, డీసీసీ అధ్యక్షురాలు సుగుణ నాయకత్వం వహిస్తున్నారు. పరిపాలనలోనూ, రాజకీయాల్లోనూ రాణిస్తూ మహిళలు సమాజానికి ఆదర్శంగా నిలుస్తున్నారు.


