News October 7, 2025
పోషకాల పశువుల మేత ‘అవిశ’

అవిశ ఆకులు పశువులకు ముఖ్యంగా పాలిచ్చే వాటికి, మేకలకు అద్భుతమైన ఆహారమని వెటర్నరీ నిపుణులు చెబుతున్నారు. అవిశ ఆకుల్లో 25-30 శాతం ప్రొటీన్లు ఉంటాయి. పశువులకు సులభంగా జీర్ణమయ్యే మేత ఇది. పశువులు అవిశ ఆకులను చాలా ఇష్టంగా తిని అధిక పాల దిగుబడినిస్తాయి. అవిశ పిండి(అవిశ గింజల నుంచి నూనె తీసిన తర్వాత మిగిలిన పదార్థం)ని కూడా పశువులకు మేతగా ఉపయోగించవచ్చు. దీనిలో ప్రొటీన్లు, పోషకాలు, ఫైబర్ సమృద్ధిగా ఉంటాయి.
Similar News
News October 7, 2025
సీనియర్ నేతలతో సీఎం రేవంత్ సుదీర్ఘ చర్చ

TG: జూబ్లీహిల్స్‌లోని తన నివాసంలో కాంగ్రెస్ సీనియర్ నేతలతో సీఎం రేవంత్ రెడ్డి సమావేశం సుదీర్ఘంగా కొనసాగుతోంది. బీసీ రిజర్వేషన్లపై రేపు హైకోర్టులో తీర్పు వ్యతిరేకంగా వస్తే ఎలా ముందుకు వెళ్లాలనే దానిపై చర్చిస్తున్నట్లు సమాచారం. అటు జూబ్లీహిల్స్ ఉపఎన్నిక అభ్యర్థి ఎంపికపైనా సీఎం సమాలోచనలు జరుపుతున్నారు.
News October 7, 2025
ఇతిహాసాలు క్విజ్ – 28 సమాధానాలు

1. రాముడు పాలించినప్పుడు కోసల దేశపు రాజధాని ‘అయోధ్య’.
2. కురుక్షేత్రంలో కర్ణుడి రథసారథి శల్యుడు.
3. భగవద్గీతలో మొత్తం 18 అధ్యాయాలు ఉన్నాయి.
4. వేంకటేశ్వర స్వామితో పాచికలు ఆడింది హథీరాం బావాజీ.
5. తెలంగాణలో బోనాల పండుగను ఆషాడ మాసంలో జరుపుకొంటారు.
<<-se>>#Ithihasaluquiz<<>>
News October 7, 2025
TDPతో పొత్తు వద్దు: నడ్డాకు BJP నేత రహస్య లేఖ

జూబ్లీహిల్స్‌లో TDPతో పొత్తు సమీకరణాలపై TBJPలో భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. సుహాసినికి చంద్రబాబు కూటమి టికెట్ ఇప్పిస్తారనే ప్రచారంపై ఓ ముఖ్య నేత JP నడ్డాకు లేఖ రాశారని విశ్వసనీయ సమాచారం. ఈ పొత్తుతో రేవంత్‌కు AP CM లాభం చేకూర్చారనే సంకేతాలు ప్రజల్లోకి వెళ్తాయని, ఈ పరిణామం తెలంగాణలో BJP వృద్ధికి అడ్డుగా ఉండొచ్చని ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటికే BJP-PCC ఒకటని BRS ఆరోపిస్తుండటం తెలిసిందే.