News October 7, 2025
JGTL: రోడ్డు ప్రమాదంలో గాయపడిన వ్యక్తి మృతి

దసరా పండగ రోజున JGTL(D) వెల్గటూర్ మం. కేంద్రంలోని దుబ్బలవాడ వద్ద బైక్ బాటసారిని ఢీకొట్టిన ఘటనలో తీవ్ర గాయాలైన వ్యక్తి చికిత్స పొందుతూ మృతి చెందాడు. మండల కేంద్రానికి చెందిన బోగ మల్లన్న(46) కరీంనగర్లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఇవాళ ప్రాణాలు వదిలాడు. బతుకుదెరువు కోసం గల్ఫ్ దేశం వెళ్లిన మల్లన్న పండగను తన కుటుంబ సభ్యులతో చేసుకుందామని ఇటీవలే స్వదేశానికి వచ్చాడు. అంతలోనే ఈ విషాదం జరిగింది.
Similar News
News March 11, 2026
అల్లూరి జిల్లాకు రానున్న పవన్ కళ్యాణ్.. ఎప్పుడంటే?

ఈనెల 14న రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ పర్యటించనున్నారని జానపద కళలు సాంస్కృతిక సృజనాత్మక అకాడమీ చైర్మన్ గంగులయ్య తెలిపారు. పాడేరులో బుధవారం ముఖ్య నాయకులతో సమావేశం నిర్వహించారు. పవన్ కళ్యాణ్ పర్యటన ఖరారు అయిందని.. విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో అరకు పార్లమెంట్ నియోజకవర్గ కన్వీనర్ గొర్ల వీర వెంకట్ ముఖ్య నాయకులు పాల్గొన్నారు.
News March 11, 2026
TU: MEd మూడో సెమిస్టర్ పరీక్షల షెడ్యూల్ విడుదల

తెలంగాణ యూనివర్సిటీ పరిధిలోని MEd 3వ సెమిస్టర్ పరీక్షల షెడ్యూల్‌ను బుధవారం విడుదల చేసినట్లు కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఆచార్య సంపత్ కుమార్ తెలిపారు. ఈ నెల 16 నుంచి 25 వరకు మధ్యాహ్నం 2గం.ల నుంచి 5గం.ల వరకు పరీక్షలు జరగనున్నాయని పేర్కొన్నారు. పరీక్షల పూర్తి వివరాలకోసం విద్యార్థులు యూనివర్సిటీ వెబ్సైట్‌ను సందర్శించాలన్నారు.
News March 11, 2026
గూగుల్, అమెజాన్‌లపై ఇరాన్ గురి

US ఎంబసీలు, సైనిక స్థావరాలపైన దాడి చేస్తున్న ఇరాన్ ఇప్పుడు టెక్ కంపెనీలపైన ఫోకస్ పెట్టింది. USకు చెందిన క్లౌడ్, డేటా అండ్ డెవలప్మెంట్ సెంటర్లు ఇరాన్ కొత్త టార్గెట్ల జాబితాలో చేరాయని ఆ దేశ మీడియా తస్నిమ్ న్యూస్ తెలిపింది. దీంతో గల్ఫ్ సహా ఇజ్రాయెల్‌లోని అమెరికన్ టెక్ కంపెనీలు అలర్ట్ అయ్యాయి. గూగుల్, మైక్రోసాఫ్ట్, ఎన్విడియా, ఐబీఎమ్, ఒరాకిల్, పాలంటీర్ సంస్థలు ఇక్కడ కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయి.


