News October 7, 2025
ఒంగోలు: లోగ్రేడ్ పొగాకు సంగతేంటి..?

కొండపి పొగాకు వేలం కేంద్రంలో నాణ్యమైన పొగాకు బేళ్లకు మంచి ధర లభిస్తోందని వేలం నిర్వహణ అధికారి సునీల్ కుమార్ పదే పదే చెబుతున్నారు. ఈ ఏడాది అధిక శాతం లో గ్రేడ్ పొగాకు దిగుబడి వచ్చింది. ధరల విషయంలో రైతులు రాజీ పడినప్పటికీ ఈ లో గ్రేడ్ పొగాకును కొనుగోలు చేయించడంలో వేలం అధికారి విఫలమయ్యారని రైతులు ఆరోపిస్తున్నారు.
Similar News
News April 2, 2026
ప్రధాని మోదీని కలిసిన MP మాగుంట బృందం

న్యూ ఢిల్లీ పార్లమెంటు భవనంలో ప్రధాని నరేంద్ర మోదీని ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా అమరావతికి చట్టబద్ధత కల్పించిన నేపథ్యంలో కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో కేంద్ర మంత్రులు, కింజరాపు రామ్మోహన్ నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్, రాష్ట్ర మంత్రి నారా లోకేశ్, కూటమి ఎంపీల బృందంతో కలిసి నంద్యాల మహిళా MP డాక్టర్ బైరెడ్డి శబరి పాల్గొన్నారు.
News April 2, 2026
9 కొత్త పర్యాటక ప్రాజెక్టులకు కేంద్రానికి ప్రతిపాదన

AP: ₹915CRతో 9 పర్యాటక ప్రాజెక్టుల కోసం మంత్రి దుర్గేష్ కేంద్ర మంత్రి షెకావత్‌కి ప్రతిపాదనలు అందించారు. మచిలీపట్నం బీచ్ అభివృద్ధికి ₹120.04CR ఇవ్వాలన్నారు. ₹95.18CRతో మంగళగిరి, ₹213.72CRతో అరసవల్లి, ₹48.95CRతో నెల్లూరు గృహ మల్లేశ్వర స్వామి,₹36CRతో కోరుకొండ నరసింహస్వామి, ₹120CRతో వాడపల్లి ఆలయాల అభివృద్ధికి ప్రతిపాదించారు. లేపాక్షిలో, లంబసింగి, బౌద్ధ క్షేత్రాల అభివృద్ధికి ₹280.24CR ఇవ్వాలని కోరారు.
News April 2, 2026
ప్రకాశం: కూతురి అసభ్యకర ఫొటోలు, వీడియోలు తండ్రికి పంపి..

ప్రకాశం(D), జరుగుమల్లి(M) గంగరాజుపాలేనికి చెందిన అశోక్ కుమార్ మూడేళ్ల క్రితం నెల్లూరుకు బేల్దారి పనుల కోసం వచ్చాడు. ఈక్రమంలో ఓ బాలికకు మాయమాటలు చెప్పి అసభ్యకరమైన ఫొటోలు, వీడియోలు తీశాడు. అశోక్ కుమార్ ఆ బాలిక తండ్రికి రూ.60 వేలు ఇవ్వాల్సి ఉండడంతో ఆయన నిలదీశాడు. దీంతో బాలిక ఫొటోలు, వీడియోలు తండ్రికి పంపాడు. కేసు రుజువు కావడంతో నిందితుడికి కోర్టు మూడేళ్ల జైలు శిక్షతో పాటు రూ.9 వేల ఫైన్ విధించింది.


