News October 7, 2025
RTCలో ఉద్యోగాలు.. ముఖ్య గమనిక

TGSRTCలో డ్రైవర్, శ్రామిక్ పోస్టులకు రేపటి నుంచి దరఖాస్తులు ప్రారంభం కానున్నాయి. SC అభ్యర్థుల కుల ధ్రువీకరణ పత్రాలు వర్గీకరణ ప్రకారం (గ్రేడ్-1,2,3) కొత్త ఫార్మాట్‌లో ఉండాలని అధికారులు తెలిపారు. కొత్త సర్టిఫికెట్‌ను సకాలంలో పొందలేకపోతే, అందుబాటులో ఉన్న SC సర్టిఫికెట్‌ను అప్‌లోడ్ చేయవచ్చని చెప్పారు. అయితే, సర్టిఫికెట్ల వెరిఫికేషన్ సమయంలో కొత్త ఫార్మాట్ కచ్చితంగా చూపించాల్సి ఉంటుందన్నారు. వివరాలకు ఇక్కడ <
Similar News
News October 7, 2025
రేపు ఈ జిల్లాల్లో భారీ వర్షాలు

AP: ద్రోణి ప్రభావంతో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో రేపు పిడుగులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశముందని APSDMA తెలిపింది. అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు, ఉత్తరాంధ్ర, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, ATP, శ్రీసత్యసాయి, కడప జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడొచ్చని పేర్కొంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.
News October 7, 2025
సీనియర్ నేతలతో సీఎం రేవంత్ సుదీర్ఘ చర్చ

TG: జూబ్లీహిల్స్‌లోని తన నివాసంలో కాంగ్రెస్ సీనియర్ నేతలతో సీఎం రేవంత్ రెడ్డి సమావేశం సుదీర్ఘంగా కొనసాగుతోంది. బీసీ రిజర్వేషన్లపై రేపు హైకోర్టులో తీర్పు వ్యతిరేకంగా వస్తే ఎలా ముందుకు వెళ్లాలనే దానిపై చర్చిస్తున్నట్లు సమాచారం. అటు జూబ్లీహిల్స్ ఉపఎన్నిక అభ్యర్థి ఎంపికపైనా సీఎం సమాలోచనలు జరుపుతున్నారు.
News October 7, 2025
ఇతిహాసాలు క్విజ్ – 28 సమాధానాలు

1. రాముడు పాలించినప్పుడు కోసల దేశపు రాజధాని ‘అయోధ్య’.
2. కురుక్షేత్రంలో కర్ణుడి రథసారథి శల్యుడు.
3. భగవద్గీతలో మొత్తం 18 అధ్యాయాలు ఉన్నాయి.
4. వేంకటేశ్వర స్వామితో పాచికలు ఆడింది హథీరాం బావాజీ.
5. తెలంగాణలో బోనాల పండుగను ఆషాడ మాసంలో జరుపుకొంటారు.
<<-se>>#Ithihasaluquiz<<>>