News October 7, 2025
జంగారెడ్డిగూడెం: పోలీస్ జాగిలంతో తనిఖీలు

జంగారెడ్డిగూడెంలో పోలీసులు మంగళవారం జాగిలంతో తనిఖీలు నిర్వహించారు. సీఐ సుభాశ్, ఎస్ఐ జబీర్‌లు బస్టాండ్, జనాలు రద్దీగా ఉండే ప్రాంతాల్లో ఈ తనిఖీలు చేశారు. జాగిలాలతో బస్ స్టాండ్‌లోని ప్రయాణికుల లగేజీలు, పార్శిల్ ప్రాంతాలు, అనుమానాస్పద వస్తువులను క్షుణ్ణంగా పరిశీలించారు. రవాణా కేంద్రాల్లో మాదక ద్రవ్యాల అక్రమ రవాణా, దొంగతనాలు నివారించడమే లక్ష్యంతో ఈ తనిఖీలు చేశామని సీఐ తెలిపారు. –
Similar News
News October 7, 2025
విజయవాడలో చెట్టుపై నుంచి పడి వ్యక్తి మృతి

చెట్టుపై నుంచి పడి ఓ వ్యక్తి మృతి చెందిన ఘటన విజయవాడలో మంగళవారం జరిగింది. గాయత్రీ నగర్లోని నలంద స్కూల్లో చెట్లు నరికేందుకు పమిడిముక్కల నుంచి రమణ అనే వ్యక్తిని పని నిమిత్తం తీసుకొచ్చారు. చెట్టు నరుకుతూ ఉండగా రమణ ప్రమాదవశాత్తు కిందపడి మృతి చెందాడు. స్కూల్ యాజమాన్యం ప్రభుత్వాసుపత్రికి తీసుకువెళ్లగా మృతి చెందినట్లు డాక్టర్లు నిర్ధారించారు. ఈ ఘటనపై మాచవరం పోలీసులు కేసు నమోదు చేశారు.
News October 7, 2025
అమలాపురం: 81 మందికి ఉద్యోగ ఉత్తర్వులు అందజేత

నిరుద్యోగ యువత ప్రగతి కోసం ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు వికాస సంస్థ అవిరళ కృషి చేస్తోందని కలెక్టర్ మహేశ్ కుమార్ అన్నారు. మంగళవారం అమలాపురంలోని కలెక్టరేట్ వద్ద నిర్వహించిన మినీ జాబ్ మేళాలో సుమారు 123 మంది అభ్యర్థులు హాజరు కాగా వీరికి ముఖాముఖి ఇంటర్వ్యూలు, అర్హత ధ్రువ పత్రాల పరిశీలన చేశారు. 81 మందికి ఉద్యోగ ఉత్తర్వులను అందజేశారు. అధికారులు పాల్గొన్నారు.
News October 7, 2025
నల్గొండ: బాలికపై హత్యాచారం.. కఠిన చర్యలకు ఆదేశం

డైట్ స్కూల్ సమీపంలో మైనర్ బాలికపై హత్యాచారం జరగ్గా ఆ ప్రదేశాన్ని ఎస్పీ శరత్ చంద్ర పవార్ పరిశీలించారు. కేసు విచారణలో పురోగతి, సాక్ష్యాధారాల సేకరణ గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. నిందితుడిపై తక్షణమే పోక్సో చట్టం కింద కేసు నమోదు చేయాలని ఆదేశించారు. కఠిన చర్యలు తీసుకోవాలన్నారు.