News October 7, 2025

చిత్తూరు: ధరలు తగ్గింపు పై అవగాహన కల్పించాలి

image

సూపర్ జీఎస్టీతో తగ్గిన ధరలపై ప్రజలకు అవగాహన కల్పించాలని కలెక్టర్ సుమిత్ కుమార్ మంగళవారం ఆదేశించారు. ఎంపీడీవోలు, మున్సిపల్ కమిషనర్లతో ఆయన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. క్షేత్రస్థాయిలో తాగునీటి సమస్యలను గుర్తించి వెంటనే పరిష్కరించాలన్నారు. ఓవర్ హెడ్ ట్యాంకులు పరిశుభ్రంగా ఉంచాలన్నారు. వ్యాధుల బారిన పడకుండా చర్యలు తీసుకోవాలన్నారు.

Similar News

News October 7, 2025

కల్తీ మద్యం.. ములకలచెరువు ఎక్సైజ్ సీఐపై వేటు

image

ములకలచెరువు ఎక్సైజ్ సీఐ హిమబిందుపై వేటు పడింది. ఇటీవల నకిలీ మద్యం తయారీ స్థావరాన్ని పోలీసులు సీజ్ చేసిన విషయం తెలిసిందే. అయితే ఈ మద్యం తయారీ స్థావరాన్ని గుర్తించడంలో అలసత్వం వహించారనే కారణంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఆమెను విజయవాడ ఎక్సైజ్ కమిషనర్ ఆఫీసుకు అటాచ్ చేస్తూ ప్రభుత్వం ఉత్వర్వులు జారీ చేసింది. లక్కిరెడ్డిపల్లె ఎక్సైజ్‌ సీఐ కిషోర్‌ ములకలచెరువు ఎక్సైజ్‌ సీఐ బాధ్యతలు చేపట్టనున్నారు.

News October 7, 2025

చిత్తూరు: వర్షాలు ఎఫెక్ట్.. విద్యుత్ శాఖకు భారీ నష్టం

image

జిల్లాలోని వర్షం కారణంగా పలు ట్రాన్స్‌ఫార్మర్లు దెబ్బతినడంతో విద్యుత్ శాఖకు రూ.5 లక్షల నష్టం వాటిల్లింది. పిడుగుపాటుకు చిత్తూరు జిల్లాలో 14 ట్రాన్స్‌ఫార్మర్లు దెబ్బతిన్నాయి. 25 విద్యుత్ స్తంభాలు ధ్వంసం అయ్యాయి. యుద్ధ ప్రాతిపదికన వీటి మరమ్మతులు నిర్వహిస్తున్నట్లు విద్యుత్ శాఖా అధికారి ఇస్మాయిల్ అహ్మద్ తెలిపారు.

News October 7, 2025

చిత్తూరు: బ్యానర్ల ఏర్పాటుపై ప్రిన్సిపల్‌కు మెమో

image

చిత్తూరులోని స్థానిక పీసీఆర్ కళాశాల ప్రాంగణంలో రాజకీయ పార్టీల బ్యానర్లు ఏర్పాటు చేయడంపై ఇంటర్మీడియట్ బోర్డ్ ప్రిన్సిపల్ అబ్దుల్ మజీద్‌కు మెమో జారీ చేసింది. బ్యానర్లు ఏర్పాటుతోపాటు ప్రిన్సిపల్ ఫోటో ప్రచురించడంపై ఇంటర్మీడియట్ బోర్డు వివరణ కోరింది. కళాశాల విద్యార్థుల అర్ధ నగ్న ఫోటోలు ప్రదర్శించారని బోర్డుకు ఫిర్యాదులు అందాయి. పూర్తి వివరాలతో వివరణ ఇవ్వాలని బోర్డు ఆదేశించింది.