News October 7, 2025
సంగారెడ్డి కలెక్టర్ కార్యాలయంలో వాల్మీకి జయంతి

వాల్మీకి జయంతి సందర్భంగా సంగారెడ్డి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఆయన చిత్రపటానికి మంగళవారం పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ ప్రావిణ్య మాట్లాడుతూ.. వాల్మీకి చూపిన మార్గంలో నేటి యువత నడవాలని కోరారు. భారత సాంస్కృతిక వారసత్వానికి రామాయణం ఆధారం అయిందని ఆమె పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బీసీ వెల్ఫేర్ సహాయ సంక్షేమ అధికారిణి అమర జ్యోతి, నాయకులు, సిబ్బంది పాల్గొన్నారు.
Similar News
News October 7, 2025
సాంకేతిక విద్యతోనే ఉజ్వల భవిష్యత్తు: కలెక్టర్ హనుమంతరావు

యువత సాంకేతిక కోర్సుల్లో శిక్షణ పొందడం ద్వారా ఉజ్వల భవిష్యత్తుతో పాటు మరిన్ని ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని కలెక్టర్ హనుమంతరావు అన్నారు. మంగళవారం ఆలేరులోని పాలిటెక్నిక్ కళాశాలలో ఏర్పాటు చేసిన అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ సెంటర్‌ను ఆయన పరిశీలించారు. ఏటీసీ సెంటర్‌లో శిక్షణ పొందుతున్న విద్యార్థుల సంఖ్య, అందిస్తున్న కోర్సుల వివరాలను కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు.
News October 7, 2025
రేపు పెదఅమిరం రానున్న మాజీ సీఎం జగన్

మాజీ సీఎం వైఎస్ జగన్ బుధవారం జిల్లాకు రానున్నారు. మధ్యాహ్నం 2.40 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి భీమవరం చేరుకుంటారు. అక్కడినుంచి పెదఅమిరం చేరుకుని వైఎస్సార్‌సీపీ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే ముదునూరి ప్రసాద రాజు కుమారుడి వివాహ వేడుకకు హాజరవుతారు. అనంతరం సాయంత్రం తాడేపల్లి చేరుకుంటారు. ఈ సందర్భంగా జగన్ అభిమానుల్లో ఉత్సాహం నెలకొంది.
News October 7, 2025
ఆదిలాబాద్: ఈ నెల 25లోపు KYC చేసుకోవాలి

ప్రస్తుతం పోస్టు శాఖా ద్వారా పింఛను పొందుతున్న చేయూత పింఛనుదారులు అందరూ బ్యాంక్‌లో నగదు జమ కావాలంటే బ్యాంకు ఖాతా యాక్టివేషన్ కోసం కేవైసీ చేయించుకొవాలని కలెక్టర్ రాజర్షి షా సూచించారు. ఆధార్ కార్డు వివరాలు మున్సిపాలిటీలో ఈ నెల 25లోపు సమర్పించాలన్నారు. లేనిపక్షంలో తర్వాత పింఛను తీసుకోవడానికి గురయ్యే ఇబ్బందులకు తమరే భాధ్యత వహించవలసి ఉంటుందని స్పష్టం చేశారు.