News October 7, 2025
సమ్‌థింగ్ ఫిషీ.. ‘బుల్ ఇష్యూ’పై కాంగ్రెస్ ఫోకస్

TG: మంత్రి అడ్లూరి లక్ష్మణ్ మాటల మంటలు హాట్ టాపిక్‌గా మారాయి. ఏళ్లుగా ఉన్న చనువుతో వారి మధ్య ‘దున్నపోతు’ లాంటి పర్సనల్ కామెంట్స్ కామన్‌గా కాంగ్రెస్ భావించింది. కానీ ఇవాళ పొన్నంపై లక్ష్మణ్ ఫైరయ్యారు. అటు మరో మంత్రి వివేక్ తనను సహించడం లేదని ఆరోపించడంతో సమ్‌థింగ్ ఫిషీ అని కాంగ్రెస్ రంగంలోకి దిగింది. వీరి మధ్య గ్యాప్ ఇష్యూ క్లోజ్ చేసేందుకు మంత్రి శ్రీధర్ బాబు, PCC చీఫ్ వారితో చర్చిస్తున్నారు.
Similar News
News October 7, 2025
విద్యారంగాన్ని సర్వనాశనం చేశారు: జగన్

AP: విద్యారంగాన్ని సర్వనాశనం చేశారని కూటమి ప్రభుత్వంపై జగన్ మండిపడ్డారు. ‘మనం మరో 5 ఏళ్లు కొనసాగుంటే విద్యార్థులు అంతర్జాతీయ స్థాయిలో అభివృద్ధి చెందేవారు. మన విద్యా పథకాలను నిర్వీర్యం చేశారు’ అని విమర్శించారు. ఫీజు రీయింబర్సుమెంటు ఇవ్వడం లేదని, పిల్లలు చదువులు మానేస్తున్నారని చెప్పారు. రైతులనూ నిండా ముంచారని పేర్కొన్నారు. గిట్టుబాటు ధరలు లేకపోగా ఎరువులు రేట్లు పెంచి అమ్ముతున్నారని ఆరోపించారు.
News October 7, 2025
మాజీ ప్రధాని దేవెగౌడకు అస్వస్థత

మాజీ ప్రధాని HD దేవెగౌడ(92) అస్వస్థతకు గురయ్యారు. యూరినరీ ట్రాక్ట్ ఇన్‌ఫెక్షన్(UTI)తో బాధపడుతున్న ఆయనను నిన్న బెంగళూరులోని మణిపాల్ ఆసుపత్రిలో చేర్పించారు. చికిత్స అందించిన వైద్యులు.. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు తెలిపారు. ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నట్లు చెప్పారు.
News October 7, 2025
మలయాళ సూపర్‌స్టార్‌కు అరుదైన గౌరవం

మలయాళ సూపర్‌స్టార్ మోహన్‌లాల్‌కు అరుదైన గౌరవం దక్కింది. ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది నుంచి ఆయన COAS కమెండేషన్ కార్డ్ అందుకున్నారు. ఈ సందర్భంగా సంతోషం వ్యక్తం చేస్తూ మోహన్‌లాల్ ట్వీట్ చేశారు. ‘హానరరీ లెఫ్టినెంట్ కల్నల్ గుర్తింపు దక్కడం గర్వంగా ఉంది. ఆర్మీ చీఫ్, నా మాతృసంస్థైన టెరిటోరియల్ ఆర్మీకి ధన్యవాదాలు’ అని పేర్కొన్నారు. ఇటీవల ఆయన దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు అందుకున్న విషయం తెలిసిందే.