News October 7, 2025

14న రాజంపేటలో వాహనాల వేలం

image

రాజంపేట ఆర్టీసీ డిపోలో ఈనెల 14వ తేదీన రవాణాశాఖ ఆధ్వర్యంలో వాహనాల వేలం నిర్వహిస్తామని జిల్లా రవాణా శాఖ అధికారి ప్రసాద్ వెల్లడించారు. ఆయన మాట్లాడుతూ.. రవాణా శాఖ అధికారులు చేపట్టిన తనిఖీల్లో పలు వాహనాలు పట్టబడ్డాయని చెప్పారు. ఆరోజు ఉదయం 10 గంటలకు జరిగే వేలంలో ఆసక్తి ఉన్నవాళ్లు పాల్గొనాలని కోరారు.

Similar News

News March 11, 2026

NLC ఇండియా లిమిటెడ్‌లో 16 పోస్టులు

image

నైవేలి లిగ్నైట్ కార్పొరేషన్(NLC) ఇండియా లిమిటెడ్‌ 16 హెల్త్ ఇన్‌స్పెక్టర్ల పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ ఇచ్చింది. అర్హులకు ఇంటర్/డిప్లోమా(శానిటరీ ఇన్‌స్పెక్టర్‌)/బ్యాచిలర్ డిగ్రీ/పీజీ డిప్లోమాతో పాటు ఉద్యోగ అనుభవం ఉండాలని పేర్కొంది. వయసు 30 ఏళ్లు దాటకూడదు. వేతనం రూ.38 వేలు. రాత పరీక్షతో అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఆన్‌లైన్‌ దరఖాస్తుకు 02-04-2026 చివరి తేదీ. మరిన్ని వివరాలకు www.nlcindia.in చూడండి.

News March 11, 2026

WGL: ఆస్పత్రుల లైసెన్స్ రెన్యువల్ ఆలస్యం..!

image

WGL నగరంతో పాటు జిల్లాలోని ప్రైవేట్ ఆస్పత్రులు, క్లినిక్ల లైసెన్స్ రెన్యువల్ అంశం వివాదంగా మారింది. జిల్లాలో సుమారు 170 ఆస్పత్రులు, క్లినిక్‌లు ఉండగా వాటిలో 40కిపైగా లైసెన్స్ రెన్యువల్ దరఖాస్తులు DMHO కార్యాలయంలో పెండింగ్‌లో ఉన్నట్లు సమాచారం. క్లినికల్ ఎస్టాబ్లిష్‌మెంట్స్ యాక్ట్ ప్రకారం కలెక్టర్ అనుమతి అవసరం కావడంతో ప్రక్రియ ఆలస్యం అవుతోందని, తద్వారా CMRF, హెల్త్ ఇన్సూరెన్స్ క్లెయిమ్ కావట్లేదు.

News March 11, 2026

TG గవర్నర్‌గా శివ ప్రతాప్ శుక్లా ప్రమాణం

image

నేడు 11.30 గంటలకు HYDలోని లోక్ భవన్‌లో తెలంగాణ నూతన గవర్నర్‌గా శివ ప్రతాప్ శుక్లా ప్రమాణం చేయనున్నారు. హైకోర్టు చీఫ్ జస్టిస్ అపరేశ్ కుమార్ సింగ్ ఆయనతో ప్రమాణం చేయించనున్నారు. ఈ కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, స్పీకర్ ప్రసాద్, మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి, సీఎస్, మంత్రులు తదితరులు హాజరవుతారు.