News October 7, 2025

DGPని కలిసిన జగిత్యాల SP అశోక్ కుమార్

image

జగిత్యాల జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ ఇటీవల రాష్ట్ర డీజీపీగా నూతనంగా నియమితులైన శివధర్ రెడ్డి‌ని ఆయన కార్యాలయంలో మంగళవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఎస్పీ DGPకి పూల మొక్కను అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. సానుభూతి, ఉత్సాహభరితమైన సంభాషణతో ముగిసిన ఈ సమావేశం పోలీస్ వర్గాల్లో సానుకూల స్పందనను రేకెత్తించింది.

Similar News

News March 20, 2026

శ్రీధర్ అజ్ఞాతం వీడినట్టే…!

image

రైల్వేకోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ అజ్ఞాతం వీడి ప్రజా సేవకు వచ్చారు. 3నెలల క్రితం ఎమ్మెల్యేపై ఓ మహిళ ఆరోపణలు పెను దుమారం రేపాయి. పార్టీ పరంగా ఆయనను దూరం పెట్టారు. ఎలాంటి కార్యక్రమాల్లో ఆయన కనిపించలేదు. అసెంబ్లీకి సైతం వెళ్లలేదు. అకాల వర్షాల కారణంగా ఓబులవారిపల్లిలో దెబ్బతిన్న అరటి పంట రైతులను శుక్రవారం అధికారులతో కలిసి ఆయన సందర్శించారు. మరోవైపు ఎమ్మెల్యేపై చర్యలు తీసుకోకపోవడాన్ని మహిళ ఖండిస్తోంది.

News March 20, 2026

విశాఖ: 26న పనికిరాని పాత 104 వాహనాల వేలం

image

విశాఖ జిల్లాకు సంబంధించిన పనిచేయని 104 సేవల పనికిరాని పాత వాహనాలను ఈ-వేలం వేయనున్నట్టు DMHO జగదీశ్వర రావు శుక్రవారం తెలిపారు. మొత్తం 20 పనికిరాని వాహనాలను మార్చి 26న ఉదయం 11 నుంచి సాయంత్రం 4 వరకు ఆన్‌లైన్ ద్వారా ఈ-వేలం వేయనున్నట్టు చెప్పారు. వేలం నియమనిబందనలు https://konugolu.ap.gov.in పోర్టల్‌లో పొందుపరిచారు. పూర్తి వివరాలకు పోర్టల్‌లో చెక్ చేయాలన్నారు.

News March 20, 2026

సంగారెడ్డి: ఫోటోగ్రఫీలో ఉచిత శిక్షణ.. నిరుద్యోగులకు వరం

image

నిరుద్యోగ యువతకు స్వయం ఉపాధి కల్పించే లక్ష్యంతో స్టేట్ బ్యాంక్ గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ కేంద్రం (RSETI) ఆధ్వర్యంలో ఉచిత ఫోటోగ్రఫీ, వీడియోగ్రఫీ శిక్షణ ఇవ్వనున్నట్లు డైరెక్టర్ రాజేష్ కుమార్ తెలిపారు. సంగారెడ్డి, మెదక్ జిల్లాలకు చెందిన 19-45 ఏళ్ల లోపు యువకులు ఈ శిక్షణకు అర్హులు. ఆసక్తి గల వారు బైపాస్ రోడ్డులోని కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఏప్రిల్ 2 నుంచి శిక్షణ ఉంటుందన్నారు.