News October 7, 2025

NRPT: భార్య మృతి తట్టుకోలేక భర్త ఆత్మహత్య

image

భార్య మరణాన్ని తట్టుకోలేక భర్త ఆత్మహత్య చేసుకున్న ఘటన నారాయణపేట జిల్లా నర్వ మండలంలో చోటు చేసుకుంది. నర్వ గ్రామానికి చెందిన కట్ట రాము ఇటీవల తన భార్య ఆత్మహత్య చేసుకుంది. మనస్థాపానికి గురైన రాము రైలు కిందపడి బలవన్మరణానికి పాల్పడ్డాడు. మృతునికి ఇద్దరు కుమారులు ఒక కుమార్తె ఉన్నారు. ఈ ఘటనతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

Similar News

News October 7, 2025

జగిత్యాల: ఎన్నికల్లో పోటీ చేయోద్దంటూ బైక్ ధ్వంసం

image

గుండంపల్లిలో ఎన్నికల్లో పోటీ చేయాలని చూస్తున్న అభ్యర్థికి గుర్తుతెలియని వ్యక్తుల నుంచి బెదిరింపులు వచ్చాయి. పోటీ చేయవద్దని హెచ్చరిస్తూ అతడి పొలం వద్ద పార్క్ చేసిన బైక్‌ను దుండగులు ధ్వంసం చేశారు. దీంతో అభ్యర్థి తనపై ప్రాణహాని ఉందని భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. తాను గెలిచే అవకాశం ఉండటం వల్లే బెదిరిస్తున్నారని, అధికారులు తక్షణమే చొరవ తీసుకుని రక్షణ కల్పించాలని బాధితుడు కోరారు.

News October 7, 2025

గ్రూప్‌-1పై హైకోర్టు ఆదేశాలపై స్టేకు సుప్రీం నిరాకరణ

image

TG: గ్రూప్-1పై రాష్ట్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో ఊరట లభించింది. హైకోర్టు <<17813238>>ఆదేశాలపై<<>> స్టే ఇచ్చేందుకు అత్యున్నత ధర్మాసనం నిరాకరించింది. గ్రూప్-1 ఫలితాలపై హైకోర్టు తీర్పును పలువురు సుప్రీంలో సవాల్ చేశారు. అయితే హైకోర్టు డివిజన్ బెంచ్ మధ్యంతర తీర్పే ఇచ్చినందున జోక్యం చేసుకోలేమని జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని ధర్మాసనం స్పష్టం చేసింది.

News October 7, 2025

‘ఉపాధి హామీ వేతనదారులు ఈ-కేవైసీ చేయించుకోవాలి’

image

ఉపాధి హామీ పథకం వేతనదారులకు ఈ-కేవైసీ చేస్తున్నామని డ్వామా పీడీ పూర్ణిమాదేవి తెలిపారు. NMMS యాప్‌లో ముఖ ఆధారిత హాజరు నమోదుకు దీన్ని చేపట్టామన్నారు. ఉపాధి హామీ పథకంలో ఒకరికి బదులు మరొకరు పనికి రాకుండా ముఖ ఆధారిత హాజరు పద్ధతి ప్రారంభం కానుందని అన్నారు. జిల్లాలో 47,725 మందికి ఈ-కేవైసీ జరుగుతుందన్నారు. ఆధార్ కార్డు, జాబ్ కార్డులతో క్షేత్ర సహాయకుడిని సంప్రదించాలని కోరారు. ‌