News October 7, 2025

‘కాళేశ్వరం’ రిపోర్టు.. హైకోర్టులో విచారణ వాయిదా

image

TG: కాళేశ్వరం కమిషన్ నివేదికపై దాఖలైన పిటిషన్లపై నేడు హైకోర్టులో విచారణ జరిగింది. జస్టిస్ ఘోష్ కమిషన్ ఇచ్చిన నివేదిక ఆధారంగా చర్యలు తీసుకోవద్దంటూ మాజీ సీఎం KCR, హరీశ్ రావు వేర్వేరుగా పిటిషన్లు దాఖలు చేశారు. దీనిపై కౌంటర్ దాఖలు చేయాలని ఇటీవల ప్రభుత్వాన్ని కోర్టు ఆదేశించింది. అయితే కౌంటర్ దాఖలుకు ప్రభుత్వం ఇవాళ 2 వారాల గడువు కోరింది. దీంతో తదుపరి విచారణను వచ్చే నెల 12కి కోర్టు వాయిదా వేసింది.

Similar News

News October 7, 2025

కాంతార డ్రెసప్‌తో దైవాన్ని అపహాస్యం చేయొద్దు: రిషబ్ శెట్టి

image

‘కాంతార’ దైవ వస్త్రధారణతో అభిమానులు థియేటర్లలోకి రావడం, వీడియోలను SMలో పెట్టడం సరికాదని నటుడు రిషబ్ శెట్టి తెలిపారు. ఫ్యాన్స్ ఇలా చేయడం బాధిస్తోందని పేర్కొన్నారు. ఇది దైవాన్ని అపహాస్యం చేయడమేనని వ్యాఖ్యానించారు. ‘మేం చాలా పవిత్రంగా దైవ పాత్రలను సినిమాలో చూపించాం. ఎమోషన్స్ కోసం కొన్ని సన్నివేశాలు, దృశ్యాలను మూవీలో పెడుతుంటాం. SMలో వైరలవ్వడం కోసం కొందరు ఇలా చేయడం మానుకోవాలి’ అని కోరారు.

News October 7, 2025

గ్రూప్‌-1పై హైకోర్టు ఆదేశాలపై స్టేకు సుప్రీం నిరాకరణ

image

TG: గ్రూప్-1పై రాష్ట్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో ఊరట లభించింది. హైకోర్టు <<17813238>>ఆదేశాలపై<<>> స్టే ఇచ్చేందుకు అత్యున్నత ధర్మాసనం నిరాకరించింది. గ్రూప్-1 ఫలితాలపై హైకోర్టు తీర్పును పలువురు సుప్రీంలో సవాల్ చేశారు. అయితే హైకోర్టు డివిజన్ బెంచ్ మధ్యంతర తీర్పే ఇచ్చినందున జోక్యం చేసుకోలేమని జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని ధర్మాసనం స్పష్టం చేసింది.

News October 7, 2025

విద్యారంగాన్ని సర్వనాశనం చేశారు: జగన్

image

AP: విద్యారంగాన్ని సర్వనాశనం చేశారని కూటమి ప్రభుత్వంపై జగన్ మండిపడ్డారు. ‘మనం మరో 5 ఏళ్లు కొనసాగుంటే విద్యార్థులు అంతర్జాతీయ స్థాయిలో అభివృద్ధి చెందేవారు. మన విద్యా పథకాలను నిర్వీర్యం చేశారు’ అని విమర్శించారు. ఫీజు రీయింబర్సుమెంటు ఇవ్వడం లేదని, పిల్లలు చదువులు మానేస్తున్నారని చెప్పారు. రైతులనూ నిండా ముంచారని పేర్కొన్నారు. గిట్టుబాటు ధరలు లేకపోగా ఎరువులు రేట్లు పెంచి అమ్ముతున్నారని ఆరోపించారు.