News October 7, 2025
పెద్దపల్లి ఎమ్మెల్యే నివాసానికి మంత్రులు

ఆదిలాబాద్ పర్యటనలో భాగంగా రాష్ట్ర మంత్రులు జూపల్లి కృష్ణారావు, అడ్లూరి లక్ష్మణ్ కుమార్ మంగళవారం పెద్దపల్లి జిల్లా ఎలిగేడు మండలం శివపల్లి గ్రామంలోని ఎమ్మెల్యే చింతకుంట విజయరమణా రావు నివాసానికి వచ్చారు. ఈ సందర్భంగా MLA వారికి ఘన స్వాగతం పలికారు. అనంతరం నియోజకవర్గ అభివృద్ధి, స్థానిక సంస్థల ఎన్నికలపై వారంతా చర్చించారు. ఈ కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
Similar News
News October 7, 2025
కీటక జనిత వ్యాధుల నియంత్రణపై చర్యలు చేపట్టాలి : DMHO

పెద్దపల్లి జిల్లా DMHO డా. వాణిశ్రీ రాగినేడు మంగళవారం గర్రెపల్లిలో ఆశ కార్యకర్తల సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కీటక జనిత వ్యాధులపై అవగాహన కల్పించారు. ప్రతి ఆశ 30 ఇళ్లు సందర్శించి దోమల లార్వా నిల్వలు తొలగించాలని, ప్రతి శుక్రవారం డ్రై డే పాటించాలని ఆదేశించారు. గర్భిణీ స్త్రీల నమోదు, జ్వరాల సర్వే, క్షయ నియంత్రణ వంటి ప్రభుత్వ కార్యక్రమాలను పక్కాగా అమలు చేయాలని ఆమె సూచించారు.
News October 7, 2025
సంగారెడ్డి జిల్లాలో భూసేకరణ వేగవంతం చేయాలి: కలెక్టర్

జిల్లాలో భూ సేకరణ వేగవంతం చేసేలా అధికారులు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ప్రావీణ్య ఆదేశించారు. సంగారెడ్డి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో వివిధ శాఖల అధికారులతో మంగళవారం సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ ఆర్ఆర్ఆర్ కింద భూసేకరణ వేగవంతం చేసేలా చర్యలు తీసుకోవాలని చెప్పారు. రైతులకు పరిహారం ఇచ్చేలా చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. సమావేశంలో అధికారులు పాల్గొన్నారు.
News October 7, 2025
MBNR: తెలుగు వర్శిటీ.. ఫలితాలు విడుదల

తెలుగు వర్శిటీ డిప్లొమా, సర్టిఫికెట్ కోర్సులకు వివిధ అంశాలలో వార్షిక పరీక్షల ఫలితాలను విడుదల చేసినట్లు తెలుగు వర్శిటీ అధికారులు Way2Newsతో తెలిపారు. 2024-25 విద్యా సంవత్సరానికి గాను.. తెలుగు విశ్వవిద్యాలయానికి అనుబంధంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న 14 ప్రభుత్వ సంగీత, నృత్య పాఠశాలలు, కళాశాలల్లో జూన్ 2025లో పరీక్షలు నిర్వహించారు. ఫలితాలను www.teluguuniversity.ac.in వెబ్ సైట్‌లో సందర్శించాలన్నారు.