News October 7, 2025

జగన్ రోడ్ షోకు అనుమతి నిరాకరణ

image

AP: ఎల్లుండి అనకాపల్లి జిల్లాలో మాజీ CM జగన్ రోడ్‌ షోకు పోలీసులు అనుమతి ఇవ్వలేదు. విశాఖ నుంచి మాకవరపాలెం మెడికల్ కాలేజీకి రోడ్డు మార్గంలో వెళ్లేందుకు అనుమతి ఇవ్వలేమని SP తుహీన్ సిన్హా తెలిపారు. ‘ఈ 2 ప్రాంతాల మధ్య దూరం 63km. TNలోని కరూర్ ఘటన నేపథ్యంలో పర్మిషన్ ఇవ్వలేదు. హెలికాప్టర్‌లో వెళ్తామంటే పరిశీలిస్తాం’ అని అన్నారు. కాగా అనుమతి ఇవ్వకపోయినా జగన్ రోడ్‌షో ఉంటుందని మాజీ మంత్రి గుడివాడ తెలిపారు.

Similar News

News March 15, 2026

నావిక్‌కు అంతరాయం

image

GPSకు ప్రత్యామ్నాయంగా భారత్ అభివృద్ధి చేసిన NavIC(నావిగేషన్ విత్ ఇండియన్ కాన్‌స్టలేషన్)కు ఇబ్బంది ఎదురైంది. ఈ వ్యవస్థలో భాగంగా ఏర్పాటైన 4 శాటిలైట్ల(IRNSS)లో ఒకటి విఫలమైనట్లు ఇస్రో అధికారులు తెలిపారు. ఇందులోని 3 అటామిక్ క్లాక్‌లలో ఇప్పటికే 2 చెడిపోగా, చివరిదీ ఫెయిలవడంతో నావిగేషన్, పొజిషనింగ్ సేవలు నిలిచిపోయాయన్నారు. 10ఏళ్ల కాలపరిమితితో ఈ ఉపగ్రహాన్ని 2016 మార్చి 10న ఇస్రో ప్రయోగించింది.

News March 15, 2026

భారీగా పెరిగిన చికెన్ ధరలు

image

తెలుగు రాష్ట్రాల్లో చికెన్ ధరలు భారీగా పెరిగాయి. హైదరాబాద్‌లో గత వారం KG స్కిన్ లెస్ ₹290-300 ఉండగా, ఇవాళ రూ.350 వరకు అమ్ముతున్నారు. APలోని పలు ప్రాంతాల్లో ₹315-320గా ఉంది. ఇవాళ ఆదివారం కావడంతో రేట్లు మరింత పెరిగే అవకాశం ఉంది. దిగుమతి తగ్గడం, ఎండ వేడికి కోళ్లు చనిపోతుండటంతో ధరలు పెరుగుతున్నట్లు తెలుస్తోంది. ఈ స్థాయికి చికెన్ రేటు చేరడం ఇదే తొలిసారని వ్యాపారులు అంటున్నారు.

News March 15, 2026

సరదా కోసం మరోసారి దాడి చేస్తాం: ట్రంప్

image

ఇరాన్‌లోని <<19378419>>ఖర్గ్<<>> ద్వీపంపై కేవలం ఫన్ కోసమే తాము మరిన్ని దాడులు చేయొచ్చని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అన్నారు. ఇరాన్ తమతో డీల్‌కు సిద్ధంగా ఉన్నట్లు కనిపిస్తోందని, కానీ కండీషన్లే సరిగ్గా లేవని విమర్శించారు. ‘ఖర్గ్‌లోని చాలా భాగాన్ని పూర్తిగా నాశనం చేశాం. మేం వినోదం కోసం మళ్లీ అటాక్స్ చేసే అవకాశం ఉంది. ఇంతకీ ఇరాన్ కొత్త సుప్రీంలీడర్ బతికే ఉన్నారా’ అని ప్రశ్నించారు.