News October 7, 2025
ఏలూరు: కలెక్టరేట్‌లో మహర్షి వాల్మీకి జయంతి

ఏలూరు కలెక్టరేట్‌లోని గౌతమీ సమావేశ మందిరంలో మంగళవారం మహర్షి వాల్మీకి జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. కలెక్టర్ కె. వెట్రిసెల్వి వాల్మీకి మహర్షి చిత్రపటానికి పూలమాలలు వేశారు, జ్యోతి ప్రజ్వలన చేశారు. వాల్మీకి మహర్షి 24 వేల శ్లోకాలు, ఏడు కాండములతో కూడిన అద్భుత రామాయణాన్ని మానవాళికి అందించారని కలెక్టర్ కొనియాడారు. కృషి ఉంటే మనుషులు ఋషులవుతారని వాల్మీకి జీవిత చరిత్ర మనకు తెలియజేస్తుందని ఆమె అన్నారు.
Similar News
News October 7, 2025
దీపావళికి జాగ్రత్తలు పాటించండి: SP

దీపావళి పండగ వస్తున్న నేపథ్యంలో బాణసంచా పేలుళ్లు జరగకుండా ఏ విధమైన జాగ్రత్తలు తీసుకోవాలో తెలియజేస్తూ తూర్పుగోదావరి జిల్లా పోలీసులు పోస్టర్ సిద్దం చేశారు. మంగళవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో ఆ పోస్టర్‌ను SP నర్సింహ కిషోర్ ఆవిష్కరించారు. జిల్లా అంతటా దీపావళి మందు గుండు సామగ్రి స్టోరేజ్ గోడౌన్లు, అమ్మకాలు జరిగే ప్రదేశాలను ఆకస్మికంగా తనిఖీ చేయాలన్నారు.
News October 7, 2025
సమ్మక్క-సారక్క వర్సిటీ లోగో ప్రత్యేకతలివే..

TG: సమ్మక్క-సారక్క వర్సిటీ లోగో పరిశీలిస్తే.. మధ్యలో ఎర్ర సూర్యుడు-కుంకుమ(వెర్మిలియన్), పసుపు రంగులో సమ్మక్క, సారక్క గద్దెలు, గిరిజన సంస్కృతిలో భాగమైన నెమలి ఈకలు, జంతు కొమ్ములున్నాయి. వర్సిటీ మోటోను 3 గిరిజన భాషలు, సంస్కృత పదాలతో ‘దుమ్-జ్ఞాన్-సుదారన్’ను హిందీలో రాశారు. వీటి అర్థం.. దుమ్: విద్య(కోయ), జ్ఞాన్: జ్ఞానం(బంజారా), సుదారన్: అభివృద్ధి(గోండు). కింద సంస్కృతంలో ‘జ్ఞాన్ పరమ్ ధ్యేయమ్’ అని ఉంది.
News October 7, 2025
నవీన్ యాదవ్‌పై సోదరుడి భార్య సంచలన లేఖ

TG: జూబ్లీహిల్స్ బైపోల్‌లో INC అభ్యర్థి రేసులో ఉన్న నవీన్ యాదవ్‌కు మరో షాక్ తగిలింది. భర్తతో పాటు కుటుంబీకులు తనను వేధిస్తున్నారంటూ నవీన్ సోదరుడు వెంకట్ భార్య మహితాశ్రీ మీనాక్షీ నటరాజన్‌కు రాసిన లేఖ SMలో వైరల్ అవుతోంది. రౌడీషీటర్ బ్యాక్‌డ్రాప్ ఉన్న నవీన్ లాంటివారికి రాజకీయాల్లో స్థానం కల్పించడంతో ప్రజలకు ముప్పు వాటిల్లుతుందన్నారు. ఓటర్ కార్డులు పంచారని <<17935833>>ఇప్పటికే<<>> నవీన్‌పై క్రిమినల్ కేసు నమోదైంది.