News October 7, 2025

రోహిత్, కోహ్లీని ఎందుకు సెలక్ట్ చేశారో: మాజీ కెప్టెన్

image

వన్డే కెప్టెన్సీ నుంచి రోహిత్‌ను తొలగించడంపై విమర్శలు వ్యక్తమవుతున్న వేళ మాజీ కెప్టెన్ దిలీప్ వెంగ్‌సర్కార్ వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి. ‘AUS టూర్‌కు రోహిత్, కోహ్లీని ఎందుకు సెలక్ట్ చేశారో? లాంగ్ బ్రేక్ కారణంగా వారి ఫామ్, ఫిట్‌నెస్ అంచనా వేయడం కష్టం. కేవలం రికార్డులు చూసి ఎంపిక చేసినట్లున్నారు. సెలక్టర్లు ఆలోచించాల్సింది’ అని వ్యాఖ్యానించారు. అటు కెప్టెన్‌గా గిల్‌ను ఎంపిక చేయడాన్ని సమర్థించారు.

Similar News

News March 11, 2026

జాగ్రత్త.. 3 రోజులు భగభగలు

image

నేటి నుంచి ఈ నెల 14 వరకు మూడు రోజుల పాటు తెలంగాణలో ఉష్ణోగ్రతలు తీవ్రంగా పెరుగుతాయని వాతావరణ నిపుణులు తెలిపారు. హైదరాబాద్ నగరంలో 37-38 డిగ్రీలు, తూర్పు, ఉత్తర తెలంగాణలో 39-40 డిగ్రీల టెంపరేచర్ నమోదయ్యే అవకాశం ఉందని పేర్కొన్నారు. మధ్యాహ్నం పూట ప్రయాణాలు మానుకోవాలని, జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు.

News March 11, 2026

ఎల్లుండి రైతుల ఖాతాల్లోకి రూ.6,000

image

AP: పీఎం కిసాన్ పథకంతో కలిపి అన్నదాత సుఖీభవ నిధులు విడుదల చేయనున్నట్లు ప్రభుత్వం తెలిపింది. కృష్ణా జిల్లా గన్నవరంలో ఈ నెల 13న సీఎం చంద్రబాబు 46.80 లక్షల మంది రైతుల ఖాతాల్లో రూ.2,808 కోట్లు జమ చేయనున్నారు. పీఎం కిసాన్ కింద రూ.2వేలు, అన్నదాత సుఖీభవ కింద రూ.4వేలు కలిపి మొత్తం రూ.6వేలు డిపాజిట్ కానున్నాయి. ఇప్పటికే రెండు విడతలుగా ప్రభుత్వం రూ.6,309 కోట్లను రైతు కుటుంబాలకు పంపిణీ చేసింది.

News March 11, 2026

ఓవైపు ఎండ.. మరోవైపు వర్షం!

image

AP: రాష్ట్రంలో నేటి నుంచి ఎండ తీవ్రత స్వల్పంగా పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. అలాగే రానున్న 24 గంటల్లో ఉత్తర కోస్తాలో చెదురుమదురుగా వర్షాలు పడతాయని పేర్కొంది. ఉపరితల ద్రోణి ప్రభావంతో నిన్న అక్కడక్కడా జల్లులు కురిశాయి. పాక్షికంగా మేఘాలు ఆవరించడంతో పగటి ఉష్ణోగ్రతలు కొన్ని చోట్ల 2-3 డిగ్రీలు తక్కువగా నమోదయ్యాయి. గరిష్ఠంగా నంద్యాలలో 36.2 డిగ్రీలు నమోదైంది.