News October 7, 2025

ప్రభుత్వంపై భ్రమలు తొలగిపోయాయి: జగన్

image

AP: కూటమి ప్రభుత్వంపై ప్రజలకు భ్రమలు తొలగిపోయాయని YSRCP చీఫ్ YS జగన్ పేర్కొన్నారు. ‘వ్యవస్థలు నిర్వీర్యమైపోయాయి. అరాచకం, అవినీతి రాజ్యమేలుతోంది. పాలనపై ధ్యాస లేదు. తమ ఆదాయం పెంచుకోవాలన్న దానిపైనే కూటమి నేతలు దృష్టి పెట్టారు. రాష్ట్ర ఆదాయం పక్కదారి పట్టి చంద్రబాబు, లోకేశ్, బినామీల జేబుల్లోకి పోతున్నాయి. కూటమి తీరు దోచుకో పంచుకో తినుకో అన్నట్లుంది. అన్నింట్లోనూ అక్రమాలే’ అని ఆరోపించారు.

Similar News

News October 7, 2025

ఎన్నికలు పక్కా.. అయితే ప్లాన్ ‘A’, లేదంటే ‘B’C

image

TG: ఏదేమైనా స్థానిక ఎన్నికలు నిర్వహిస్తామని CM రేవంత్ స్పష్టం చేశారు. BCలకు 42% రిజర్వేషన్లపై హైకోర్టులో రేపు విచారణ జరగనుండగా న్యాయ నిపుణులు, మంత్రులు, ముఖ్య నేతలతో CM సమావేశమయ్యారు. తమ నిర్ణయ ఉద్దేశం, గత తీర్పులను కోర్టుకు వివరించాలని లాయర్లకు సూచించారు. G.O.ను తోసిపుచ్చితే ఆదేశాలు పాటిస్తామని HCకి విన్నవించాలన్నారు. ఇలా అయితే పార్టీపరంగా 42% రిజర్వేషన్లతో (Plan:B) ఎన్నికలకు వెళ్దామని తెలిపారు.

News October 7, 2025

తప్పుదారి పట్టించేలా ఫేక్ వీడియోలు: నిర్మల

image

తాను మాట్లాడినట్టుగా రూపొందించిన AI వీడియోలపై మంత్రి నిర్మలా సీతారామన్ స్పందించారు. ఇవి వాస్తవాలను వక్రీకరిస్తూ ప్రజలను తప్పుదారి పట్టిస్తున్నాయన్నారు. ఈ ఫేక్ వీడియోలతో నిజమేదో అబద్ధమేదో తెలీని గందరగోళం ఏర్పడుతోందని తెలిపారు. వీటిని నివారించేందుకు రక్షణ వ్యవస్థను పటిష్ఠం చేసుకోవాల్సిన అవసరముందని చెప్పారు. వ్యక్తుల రూపాలు, స్వరాలను క్లోనింగ్ చేయడానికి AIని వాడుతూ కొందరు మోసాలకు దిగుతున్నారన్నారు.

News October 7, 2025

సిరిమానోత్సవంలో తొక్కిసలాట

image

AP: విజయనగరం సిరిమానోత్సవంలో తొక్కిసలాట జరిగింది. వేడుక జరుగుతున్న ప్రాంతానికి ఆర్డీవో కీర్తి కారులో రావడంతో గందరగోళం ఏర్పడింది. ఈక్రమంలోనే తోపులాట జరిగి తొక్కిసలాటకు దారితీసింది. ఈ ఘటనలో ఓ మహిళ గాయపడగా ఆసుపత్రికి తరలించారు. ఆర్డీవో కీర్తి తీరుపై భక్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.