News October 7, 2025
వాల్మీకి జీవిత విశేషాలను ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి: కలెక్టర్

మహర్షి వాల్మీకి జీవిత విశేషాలను ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలని కలెక్టర్ హరేంధిర ప్రసాద్ అన్నారు. వాల్మీకి జయంతిని పురస్కరించుకొని విశాఖ జిల్లా బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో కలెక్టరేట్‌లో వాల్మీకి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. మానవ జీవితానికి అనువైన విధంగా వాల్మీకి రామాయణాన్ని రచించి ఎన్నో విషయాలపై మహత్తర సందేశాన్ని అందించారని గుర్తు చేశారు.
Similar News
News October 7, 2025
‘ఉపాధి హామీ వేతనదారులు ఈ-కేవైసీ చేయించుకోవాలి’

ఉపాధి హామీ పథకం వేతనదారులకు ఈ-కేవైసీ చేస్తున్నామని డ్వామా పీడీ పూర్ణిమాదేవి తెలిపారు. NMMS యాప్‌లో ముఖ ఆధారిత హాజరు నమోదుకు దీన్ని చేపట్టామన్నారు. ఉపాధి హామీ పథకంలో ఒకరికి బదులు మరొకరు పనికి రాకుండా ముఖ ఆధారిత హాజరు పద్ధతి ప్రారంభం కానుందని అన్నారు. జిల్లాలో 47,725 మందికి ఈ-కేవైసీ జరుగుతుందన్నారు. ఆధార్ కార్డు, జాబ్ కార్డులతో క్షేత్ర సహాయకుడిని సంప్రదించాలని కోరారు.
News October 7, 2025
సుజాతనగర్ జంక్షన్‌లో యాక్సిడెంట్.. మహిళ మృతి

పెందుర్తిలోని సుజాతనగర్ జంక్షన్‌లో రోడ్డు ప్రమాదం జరిగింది. రోడ్డు దాటుతున్న మహిళను ఆర్టీసీ బస్సు ఢీకొనడంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. పెందుర్తి ట్రాఫిక్ సీఐ సురేశ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. బస్సు డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
News October 7, 2025
విశాఖ: ఆర్టీసీలో ఐటీఐ అప్రెంటీస్‌లకు అవకాశం

ఏపీఎస్ఆర్టీసీ విశాఖ రీజియన్ పరిధిలో 2వ విడత ఐటీఐ అప్రెంటిస్‌షిప్ అలాట్‌మెంట్లను రీజనల్ మేనేజర్ బి.అప్పలనాయుడు మంగళవారం జారీ చేశారు. అప్రెంటిస్‌లు భద్రతా నియమాలు పాటిస్తూ నైపుణ్యం పెంచుకోవాలని సూచించారు. అప్రెంటిస్‌షిప్ పూర్తి చేసినవారికి ఖాళీలను బట్టి ఔట్‌సోర్సింగ్‌లో అవకాశాలు కల్పిస్తామన్నారు. అలాగే 18 నెలల హెవీ లైసెన్స్ అనుభవం ఉన్నవారికి ఆన్-కాల్ డ్రైవర్లుగా అవకాశం ఉందని తెలిపారు.