News October 7, 2025
రామాయణం మన పూజ్య గ్రంథం: కలెక్టర్ నాగరాణి

రామాయణ మహా కావ్యాన్ని రచించి మానవాళికి అందించి సన్మార్గాన్ని నిర్దేశించిన ఆదర్శప్రాయుడు మహర్షి వాల్మీకి అని జిల్లా కలెక్టర్ నాగరాణి అన్నారు. జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఏలూరు కలెక్టరేట్లో మంగళవారం మహర్షి వాల్మీకి జయంతి నిర్వహించారు. వాల్మీకి జయంతి ఉత్సవాలను ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తుందన్నారు. పుణ్యభూమి, కర్మభూమి మన భారతదేశమని, రామాయణం మన పూజ్య గ్రంథమన్నారు.
Similar News
News October 7, 2025
భీమవరం: ఉత్తీర్ణత సాధించిన వారికి సర్టిఫికెట్లు అందజేత

జిల్లాలో అక్షరాంద్ర ఉల్లాస్ కార్యక్రమం ద్వారా నిరక్షరాస్యులను అక్షరాస్యులుగా తీర్చిదిద్దేందుకు సంబంధిత అధికారులు కృషి చేయాలని జిల్లా కలెక్టర్ నాగరాణి అన్నారు. మంగళవారం పీజిఆర్ఎస్‌లో గత సంవత్సరం నిర్వహించినటువంటి ఉల్లాస్ అక్షరాస్యతా కార్యక్రమంలో ఉత్తీర్ణులైన వారికి భీమవరంలో సర్టిఫికెట్లను అందించారు. మహిళలు చదువుకుంటేనే అన్ని రంగాల్లో రాణించగలరని అన్నారు.
News October 7, 2025
రుణాలు సద్వినియోగం చేసుకోండి: కలెక్టర్

భీమవరం కలెక్టరేట్‌లో మంగళవారం కలెక్టర్ చదలవాడ నాగరాణి అధ్యక్షతన డీఆర్‌డీఏ, పశుసంవర్ధక శాఖలపై సమీక్ష సమావేశం జరిగింది. కలెక్టర్ మాట్లాడుతూ.. ఈ సంవత్సరం యాన్యువల్ క్రెడిట్ ప్లాన్ కింద జిల్లాకు 1,419 యూనిట్లు మంజూరయ్యాయని తెలిపారు. ఎస్‌హెచ్‌జీ (SHG) మహిళలు ఈ యూనిట్ల స్థాపన ద్వారా ఆర్థిక పురోభివృద్ధి సాధించాలని సూచించారు. స్వయం సహాయక బృందాల సభ్యులు బ్యాంకు రుణాలను సద్వినియోగం చేసుకోవాలని ఆమె కోరారు.
News October 7, 2025
రేపు పెదఅమిరం రానున్న మాజీ సీఎం జగన్

మాజీ సీఎం వైఎస్ జగన్ బుధవారం జిల్లాకు రానున్నారు. మధ్యాహ్నం 2.40 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి భీమవరం చేరుకుంటారు. అక్కడినుంచి పెదఅమిరం చేరుకుని వైఎస్సార్‌సీపీ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే ముదునూరి ప్రసాద రాజు కుమారుడి వివాహ వేడుకకు హాజరవుతారు. అనంతరం సాయంత్రం తాడేపల్లి చేరుకుంటారు. ఈ సందర్భంగా జగన్ అభిమానుల్లో ఉత్సాహం నెలకొంది.