News October 7, 2025

కల్తీ మద్యం.. ములకలచెరువు ఎక్సైజ్ సీఐపై వేటు

image

ములకలచెరువు ఎక్సైజ్ సీఐ హిమబిందుపై వేటు పడింది. ఇటీవల నకిలీ మద్యం తయారీ స్థావరాన్ని పోలీసులు సీజ్ చేసిన విషయం తెలిసిందే. అయితే ఈ మద్యం తయారీ స్థావరాన్ని గుర్తించడంలో అలసత్వం వహించారనే కారణంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఆమెను విజయవాడ ఎక్సైజ్ కమిషనర్ ఆఫీసుకు అటాచ్ చేస్తూ ప్రభుత్వం ఉత్వర్వులు జారీ చేసింది. లక్కిరెడ్డిపల్లె ఎక్సైజ్‌ సీఐ కిషోర్‌ ములకలచెరువు ఎక్సైజ్‌ సీఐ బాధ్యతలు చేపట్టనున్నారు.

Similar News

News October 7, 2025

ఎన్నికల విధులు నిర్లక్ష్యం చేయవద్దు: కలెక్టర్

image

స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో నోడల్ అధికారులు తమ విధులను సమర్థవంతంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్, ఎన్నికల అధికారి పమేలా సత్పతి ఆదేశించారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఎన్నికల ప్రవర్తన నియమావళి (ఎంసీసీ) అమలుపై అధికారులతో ఆమె సమీక్ష నిర్వహించారు. ఎన్నికల నిర్వహణలో విధులు కేటాయించబడిన అధికారులు ఎలాంటి నిర్లక్ష్యం లేకుండా పనిచేయాలని సూచించారు.

News October 7, 2025

మామిడికుదురు: జిల్లా స్థాయి జీఎస్టీ పోటీల్లో విద్యార్థి ప్రతిభ

image

మామిడికుదురు జడ్పీహెచ్ స్కూలుకు చెందిన ఎనిమిదో తరగతి విద్యార్థిని చింతలపూడి అలివేలు మంగతాయారు కోనసీమ జిల్లా స్థాయి జీఎస్టీ పోటీల్లో జూనియర్స్ విభాగంలో మొదటి స్థానం సాధించింది. అమలాపురం మునిసిపల్ హైస్కూల్‌లో ఈ పోటీలు మంగళవారం జరిగాయి. మొదటి స్థానంలో నిలిచిన మంగతాయారుకు DEO ఎస్కే భాష బహుమతిని అందించారు. ఆమెను అభినందించారు. ఆమెకు గైడ్ టీచరుగా వ్యవహరించిన గంగాభవానిని అభినందించారు.

News October 7, 2025

అమలాపురం: విద్యార్థులకు జీఎస్టీ పై వ్యాసరచన పోటీలు

image

జీఎస్టీ వార్షికోత్సవాల సందర్భంగా అమలాపురం మున్సిపల్ మహాత్మా గాంధీ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు వ్యాసరచన పోటీలు నిర్వహించారు. కోనసీమ జిల్లాకు చెందిన 22 మండలాల పాఠశాలల విద్యార్థులు ఈ పోటీల్లో పాల్గొన్నారు. హెచ్‌ఎం గణ సత్యనారాయణ ఆధ్వర్యంలో జరిగిన ఈ పోటీలను డీఈవో సలీం భాష, డిప్యూటీ కలెక్టర్ జి. మమ్మీ, ఐటీ అధికారి రవికాంత్ పర్యవేక్షించారు.