News October 7, 2025
రామ్మూర్తినాయుడుకు సీఎం నివాళులు

నారావారిపల్లెలో నారా రామ్మూర్తినాయుడు ప్రథమ వర్థంతి కార్యక్రమంలో సీఎం చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేశ్ కుటుంబ సమేతంగా నివాళులర్పించారు. ప్రథమ వర్ధంతికి సంబంధించిన క్రతువులో పాల్గొన్నారు. అనంతరం నారా రామ్మూర్తి నాయుడు స్మృతి వనం వద్ద ప్రత్యేక పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో నారా కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.
Similar News
News October 7, 2025
MBNR: PUలో ప్లేస్‌మెంట్ డ్రైవ్.. PRESS MEET.!

పాలమూరు యూనివర్సిటీలో ఈనెల 11న ప్లేస్‌మెంట్ డ్రైవ్ నిర్వహిస్తున్నట్లు యూనివర్సిటీ VC జిఎన్ శ్రీనివాస్ అన్నారు. మంగళవారం మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. మెగా ప్లేస్‌మెంట్ డ్రైవ్ నిర్వహిస్తున్నామని, BDMAI ఒప్పందం ఆధారంగా 320 ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నామని, ఉమ్మడి జిల్లాలోని ఆసక్తిగల పురుష అభ్యర్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. https://forms.gle/ctBZNQ1ByU5B6xKB6
SHARE IT.
News October 7, 2025
NLG: అధిక వడ్డీ దందా.. తెర వెనుక మరో వ్యక్తి..!

పెద్దఅడిశర్లపల్లి మండలం పలుగుతండాకు చెందిన బాలాజీ నాయక్ <<17937867>>అధిక వడ్డీ<<>> ఆశ చూపి రూ.కోట్లు వసూలు చేసి పరారీలో ఉండగా అతని ఇంటిపై బాధితులు దాడి చేసిన విషయం తెలిసిందే. ఈ దందా వెనుక మధు అనే మరో యువకుడు ఉన్నట్లు తెలుస్తోంది. బాలాజీ నాయక్‌తో కలిసి మధు అనే యువకుడు గ్రామీణ ప్రజలే లక్ష్యంగా ఈ దందా నడిపినట్లు సమాచారం. బాలాజీ కంటే మధునే ఎక్కువ మొత్తంలో డబ్బులు వసూలు చేశాడని బాధితులు ఆరోపిస్తున్నారు.
News October 7, 2025
స్పోర్ట్స్ న్యూస్ అప్డేట్స్

* ICC ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డ్‌కు నామినేట్ అయిన అభిషేక్ శర్మ, కుల్దీప్, బ్రయాన్(ZIM)
* DGCA డ్రోన్ పైలట్ సర్టిఫికేషన్ ప్రోగ్రామ్ కంప్లీట్ చేసినట్లు ప్రకటించిన భారత మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ
* సియట్ అవార్డ్స్‌లో సంజూ శాంసన్ టీ20 బ్యాటర్ ఆఫ్ ది ఇయర్ అవార్డ్, శ్రేయస్ అయ్యర్ స్పెషల్ అవార్డ్ అందుకున్నారు.
* ఆస్ట్రేలియాపై ఆడడం తనకు ఇష్టమని, అక్కడి ప్రజలు క్రికెట్‌ను ఎంతో ప్రేమిస్తారన్న రోహిత్ శర్మ