News October 7, 2025

కోదాడ: రూ.60 లక్షల గంజాయి స్వాధీనం

image

కోదాడ పోలీస్ స్టేషన్ పరిధిలో రూ.60 లక్షల విలువైన క్వింటా 20 కేజీల గంజాయిని కోదాడ సీసీఎస్ పోలీసులు పట్టుకుని సీజ్ చేశారు. ముగ్గురు నిందితులను అరెస్ట్ చేశారు. వారిని సూర్యాపేట జిల్లా పోలీస్ కార్యాలయంలో మీడియా ఎదుట ప్రవేశపెట్టారు. గంజాయి రవాణా, సరఫరా, అమ్మకం, వినియోగం నేరమని, NDPS చట్టాల ప్రకారం కఠిన చర్యలు తప్పవని ఎస్పీ నరసింహ హెచ్చరించారు.

Similar News

News October 7, 2025

ఈ విషయంలో Gen Zలు చాలా బెటర్!

image

యంగర్ జనరేషన్స్‌లో ఆల్కహాల్ అలవాటు తక్కువేనని ఓ స్టడీ తెలిపింది. ముఖ్యంగా Gen Z(1997-2012)లు బేబీ బూమర్లు(1946-64), మిలీనియల్స్‌(1981-96)తో పోల్చితే మద్యం తక్కువగా సేవిస్తున్నారని ఆస్ట్రేలియా ఫ్లిండర్స్ యూనివర్సిటీ రీసెర్చర్స్ వెల్లడించారు. 2 దశాబ్దాల్లోని 23 వేల మంది డేటాను విశ్లేషించారు. బేబీ బూమర్స్ కన్నా మిలీనియల్స్ సగటున తక్కువే తాగినా ఒకేసారి ఎక్కువ మొత్తంలో తీసుకుంటున్నట్లు గుర్తించారు.

News October 7, 2025

నల్గొండ: మైనర్‌ హత్యాచారం.. పోక్సో కేసు నమోదు

image

నల్గొండ మండలంలో బాలిక హత్యాచార ఘటనపై పోక్సో కేసు నమోదైంది. ట్రాక్టర్ డ్రైవర్ కృష్ణ బాలికను ప్రేమ పేరుతో మాయమాటలు చెప్పి గదికి తీసుకెళ్లి హత్యాచారం చేశాడని బాలిక తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆయన ఫిర్యాదు మేరకు టూ టౌన్ పోలీసులు తక్షణమే నిందితుడు కృష్ణతో పాటు అతని స్నేహితుడిపై పోక్సోతో పాటు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. దర్యాప్తును వేగవంతం చేసినట్లు పోలీసులు తెలిపారు.

News October 7, 2025

నిద్రపోయే ముందు ఇలా చేస్తే.. లక్ష్మీ కటాక్షం

image

నిద్రపోయే ముందు మహిళలు ఇంట్లోని గదులన్నింటిలో కర్పూరం వెలిగిస్తే ఆ గృహంలోకి ఐశ్వర్య దేవత అడుగు పెడుతుందని పండితులు చెబుతున్నారు. ‘కర్పూరం నవగ్రహాలలో శుక్రుడికి సంబంధించినది. నిద్రపోయే ముందు దీన్ని వెలిగిస్తే.. ఇంటి వాతావరణంలో సానుకూల శక్తి పెరిగి, శుక్రుని బలం వృద్ధి చెందుతుంది. ఫలితంగా.. ఆ ఇంట్లో సుఖశాంతులు నెలకొంటాయి. ఈ పవిత్రమైన సాధనతో లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకోవచ్చు’ అని అంటున్నారు.