News October 7, 2025
సంగారెడ్డి: స్థానిక సంస్థల ఎన్నికలకు సన్నద్ధం కావాలి: ఎస్పీ

పోలీసు అధికారులు స్థానిక సంస్థల ఎన్నికలకు సన్నద్ధం కావాలని ఎస్పీ పరితోష్ పంకజ్ సూచించారు. సంగారెడ్డి జిల్లా పోలీసు కార్యాలయంలో మంగళవారం సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. పోలింగ్ స్టేషన్ల వద్ద పోలీసుల బందోబస్తు పూర్తిస్థాయిలో ఏర్పాటుచేసిన చర్య తీసుకోవాలని చెప్పారు. ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా చర్యలు తీసుకోవాలని చెప్పారు. సమావేశంలో అదనపు ఎస్పీ రఘునందన్ రావు పాల్గొన్నారు.
Similar News
News March 26, 2026
GK: భారతదేశ భౌగోళిక విశేషాలు

*అతి పొడవైన నది- గంగా నది
* అతి పెద్ద రాష్ట్రం (వైశాల్యం)- రాజస్థాన్
* అతి పెద్ద రాష్ట్రం (జనాభా)- ఉత్తర్‌ప్రదేశ్
* అతి ఎత్తైన శిఖరం – కాంచనజంగ
* అతి పెద్ద ఎడారి – థార్ ఎడారి (రాజస్థాన్)
* అతి పొడవైన తీరరేఖ గల రాష్ట్రం- గుజరాత్
* అతి ఎత్తైన డ్యామ్ – తెహ్రీ డ్యామ్(ఉత్తరాఖండ్)
* అతి పొడవైన డ్యామ్ – హీరాకుడ్ డ్యామ్ (ఒడిశా)
* సౌత్ఇండియాలో పొడవైన నది- గోదావరి
News March 26, 2026
కృష్ణా: గ్రూప్-2 శిక్షకులకు కలెక్టర్ సూచనలు

మెళకువలు తెలుసుకుని విధి నిర్వహణలో రాణించాలని కలెక్టర్ డీకే బాలాజీ గ్రూప్-2లో ఎంపికై సీసీఎల్ఎ కార్యాలయం నుంచి జిల్లాకు శిక్షణ నిమిత్తం వచ్చిన జూనియర్ అసిస్టెంట్లకు సూచించారు. జిల్లాకు శిక్షణ నిమిత్తం వచ్చిన 11 మంది జూనియర్ అసిస్టెంట్లు గురువారం కలెక్టర్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. రీ-సర్వేను పూర్తిగా అవగాహన చేసుకోవాలని వారికి సూచించారు.
News March 26, 2026
భద్రాద్రి పునర్నిర్మాణ ఆలయ నమూనా ఇదే..!

భద్రాచలం దేవస్థానం అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం రూ.351 కోట్లను మంజూరు చేసిందని మంత్రి తుమ్మల ఈరోజు తెలిపారు. స్వామివారి కళ్యాణం అనంతరం CM రేవంత్ రెడ్డి చేతుల మీదుగా భూమి పూజ చేసి, అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టనున్నట్లు చెప్పారు. దేవాలయంతోపాటు భద్రాచలం పట్టణాన్ని సమగ్రంగా అభివృద్ధి చేయడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. అనంతరం భద్రాద్రి ఆలయ పునర్నిర్మాణ నమూనాను ఆయన విడుదల చేశారు.


