News October 7, 2025

గూడూరు: వైన్ షాపులకు దరఖాస్తు స్వీకరణ: ఎక్సైజ్ CI

image

గూడూరు ఎక్సైజ్ పరిధిలోని 12 షాపులకు 2025-27 మద్యం పాలసీలో భాగంగా మంగళవారం ఒక దరఖాస్తు స్వీకరించినట్లు CI బిక్షపతి తెలిపారు. గూడూరు 2, గంగారం 2, కొత్తగూడ 2, కేసముద్రంలో 1 (ST), కేసముద్రం1, ఇనుగుర్తి 1 (SC), కేసముద్రం2, గుండెంగ 1 షాపులను (జనరల్)గా కేటాయించినట్లు CI పేర్కొన్నారు. వీటికి సంబంధించి మహబూబాబాద్ IDOCలో దరఖాస్తు స్వీకరిస్తున్నట్లు ప్రకటించారు.

Similar News

News October 7, 2025

ఈనెల 8 నుంచి సదరం శిబిరాలు: కలెక్టర్

image

జిల్లాలో అప్పీలు చేసుకొన్న దివ్యాంగుల పెన్షన్ల అంచనాకు మళ్లీ దరఖాస్తు చేసుకున్న లబ్ధిదారులకు సదరం శిబిరాలను ఈ నెల 8 నుంచి GGH, రాజమండ్రి, అనపర్తి ఏరియా ఆసుపత్రుల్లో ప్రారంభించనున్నట్లు కలెక్టర్ కీర్తి చేకూరి మంగళవారం తెలిపారు. తక్కువ శాతం దివ్యాంగత్వం ఉండి, పెన్షన్ పొందడానికి అర్హత లేని వారిగా గతంలో నోటీసులు అందుకొన్న వారికి పునఃపరిశీలన చేస్తారన్నారు. ఈ కార్యక్రమాన్ని వినియోగించుకోవాలన్నారు.

News October 7, 2025

రాజనగరం: బైక్‌లు ఢీకొని ఇద్దరి మృతి

image

రాజానగరం మండలం నందరాడ సమీపంలో మంగళవారం రాత్రి 2 బైకులు ఢీకొన్న ఘటనలో ఇద్దరు యువకులు మృతి చెందారు. కోరుకొండ నుంచి స్కూటీపై వస్తున్న రాజానగరానికి చెందిన బుద్ధిరెడ్డి సత్యనారాయణ (36), కొవ్వూరు నుంచి బైకుపై కోరుకొండ వెళ్తున్న మెర్ల శ్రీనివాసరావు (45) ఎదురెదురుగా ఢీకొన్న ప్రమాదంలో అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు SI ప్రియ కుమార్ తెలిపారు.

News October 7, 2025

హిమాచల్‌ప్రదేశ్ ప్రమాదం.. 18 మంది మృతి

image

హిమాచల్‌ప్రదేశ్‌‌లో టూరిస్ట్ బస్సుపై కొండచరియలు విరిగిపడిన <<17942357>>ఘటనలో<<>> మృతుల సంఖ్య 18కి చేరింది. బస్సులో 30 మందికి పైగా ప్రయాణికులు ఉండగా ఇప్పటివరకు ముగ్గురిని రెస్క్యూ బృందాలు రక్షించాయి. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశముంది. ఈ ఘటనపై రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము, ప్రధాని మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతులకు రూ.2 లక్షలు, క్షతగాత్రులకు రూ.50 వేల చొప్పున PM పరిహారం ప్రకటించారు.