News October 7, 2025
స.హ చట్టంపై అవగాహన ఉండాలి: మహేందర్ జీ

సమాచార హక్కు చట్టంపై అవగాహన కలిగి ఉండాలని అదనపు కలెక్టర్ మహేందర్ జీ అన్నారు. కలెక్టరేట్ కార్యాలయంలో సమాచార హక్కు చట్ట వారోత్సవాల్లో భాగంగా ఆయన పాల్గొని మాట్లాడారు. ఈనెల 5వ తేదీ నుంచి సమాచార హక్కు చట్ట వారోత్సవాల్లో మొదలయ్యాయన్నారు. ఈ నెల 12వ తేదీ వరకు అధికారులు సమాచార హక్కు వారోత్సవాలను జిల్లాలోని డివిజన్, మండల కేంద్రాల్లో ఘనంగా నిర్వహించాలన్నారు.
Similar News
News October 7, 2025
ఈనెల 8 నుంచి సదరం శిబిరాలు: కలెక్టర్

జిల్లాలో అప్పీలు చేసుకొన్న దివ్యాంగుల పెన్షన్ల అంచనాకు మళ్లీ దరఖాస్తు చేసుకున్న లబ్ధిదారులకు సదరం శిబిరాలను ఈ నెల 8 నుంచి GGH, రాజమండ్రి, అనపర్తి ఏరియా ఆసుపత్రుల్లో ప్రారంభించనున్నట్లు కలెక్టర్ కీర్తి చేకూరి మంగళవారం తెలిపారు. తక్కువ శాతం దివ్యాంగత్వం ఉండి, పెన్షన్ పొందడానికి అర్హత లేని వారిగా గతంలో నోటీసులు అందుకొన్న వారికి పునఃపరిశీలన చేస్తారన్నారు. ఈ కార్యక్రమాన్ని వినియోగించుకోవాలన్నారు.
News October 7, 2025
రాజనగరం: బైక్‌లు ఢీకొని ఇద్దరి మృతి

రాజానగరం మండలం నందరాడ సమీపంలో మంగళవారం రాత్రి 2 బైకులు ఢీకొన్న ఘటనలో ఇద్దరు యువకులు మృతి చెందారు. కోరుకొండ నుంచి స్కూటీపై వస్తున్న రాజానగరానికి చెందిన బుద్ధిరెడ్డి సత్యనారాయణ (36), కొవ్వూరు నుంచి బైకుపై కోరుకొండ వెళ్తున్న మెర్ల శ్రీనివాసరావు (45) ఎదురెదురుగా ఢీకొన్న ప్రమాదంలో అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు SI ప్రియ కుమార్ తెలిపారు.
News October 7, 2025
హిమాచల్‌ప్రదేశ్ ప్రమాదం.. 18 మంది మృతి

హిమాచల్‌ప్రదేశ్‌లో టూరిస్ట్ బస్సుపై కొండచరియలు విరిగిపడిన <<17942357>>ఘటనలో<<>> మృతుల సంఖ్య 18కి చేరింది. బస్సులో 30 మందికి పైగా ప్రయాణికులు ఉండగా ఇప్పటివరకు ముగ్గురిని రెస్క్యూ బృందాలు రక్షించాయి. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశముంది. ఈ ఘటనపై రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము, ప్రధాని మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతులకు రూ.2 లక్షలు, క్షతగాత్రులకు రూ.50 వేల చొప్పున PM పరిహారం ప్రకటించారు.