News October 7, 2025

నిర్మల్ కలెక్టర్ పేరిట నకిలీ వాట్సాప్

image

నిర్మల్ జిల్లా కలెక్టర్ పేరు, ఫొటోను ఉపయోగించి సైబర్ నేరగాళ్లు నకిలీ వాట్సాప్ ఖాతాను సృష్టించారని జిల్లా అధికారులు తెలిపారు. ఆ ఖాతా నుంచి వివిధ వ్యక్తులు, అధికారులకు మెసేజ్‌లు వస్తున్నాయని, అది పూర్తిగా నకిలీదని స్పష్టం చేశారు. ఈ విషయాన్ని సైబర్ క్రైమ్ అధికారులకు తెలిపినట్లు వివరించారు. ఆ అకౌంట్ నుంచి వచ్చే మెసేజ్‌లకు ఎవరు స్పందించవద్దని ప్రజలకు సూచించారు.

Similar News

News March 11, 2026

సంచలన తీర్పు.. కారుణ్య మరణానికి సుప్రీం అనుమతి

image

సుప్రీంకోర్టు చరిత్రాత్మక తీర్పునిస్తూ 32 ఏళ్ల హరీశ్ రాణాకు కారుణ్య మరణం (Passive Euthanasia) కింద వైద్య సహాయాన్ని నిలిపివేసేందుకు అనుమతించింది. దేశంలో ఇటువంటి కేసు ఇదే మొదటిది కావడం గమనార్హం. 100% వైకల్యంతో రాణా 12 ఏళ్లుగా కోమాలో ఉన్నారు. ఆయనకు లైఫ్ సపోర్ట్ తొలగించాలని ధర్మాసనం సూచించింది. కోలుకునే అవకాశం లేనప్పుడు గౌరవప్రదంగా మరణించే హక్కు వ్యక్తికి ఉంటుందని కోర్టు వ్యాఖ్యానించింది.

News March 11, 2026

ఏలూరు జిల్లాలో కావూరి ప్రస్థానం ఇదే..!

image

ఏలూరు మాజీ ఎంపీ కావూరి సాంబశివరావు మృతి పట్ల పలువురు నాయకుడు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. నాయకులు తెలిపిన వివరాలు ప్రకారం.. 1984,1989లో కృష్ణా జిల్లాలోని మచిలీపట్నం ఎంపీగా పనిచేశారు. 2004, 2009లో ఏలూరు ఎంపీగా పనిచేశారు. 2013లో కేంద్ర క్యాబినెట్ మంత్రిగా పనిచేశారు. ఏలూరు జిల్లాలోని గ్రామాలలో సైతం పర్యటించి వారి సమస్యలను పూర్తిస్థాయిలో పరిష్కరించి, అభివృద్ధి బాటలో నడిపించిన వ్యక్తి అని కొనియాడారు.

News March 11, 2026

సర్‌ప్రైజింగ్.. రోడ్డుపై గుంత వల్ల దక్కిన ప్రాణం!

image

UPకి చెందిన వినీత శుక్లా(50) మరణం అంచులకు చేరి తిరిగి ప్రాణాలతో బయటపడ్డారు. డాక్టర్లు ఆమెను ‘బ్రెయిన్ డెడ్’గా ప్రకటించడంతో కుటుంబ సభ్యులు అంబులెన్స్‌లో ఇంటికి తీసుకెళ్తున్నారు. NH-74పై ఉన్న ఓ పెద్ద గుంత వల్ల వాహనం తీవ్ర కుదుపునకు లోనైంది. దాంతో ఆమెలో మళ్లీ చలనం మొదలై శ్వాస తీసుకోవడం ప్రారంభించారు. వెంటనే ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. అనంతరం ఆమె కోలుకుని ప్రస్తుతం క్షేమంగా ఉన్నారు.