News October 7, 2025
కర్నూలులో ఆటో నడిపిన మంత్రి టీజీ భరత్

కూటమి ప్రభుత్వం ఇచ్చిన ప్రతీహామీని నెరవేర్చుతోందని మంత్రి TG భరత్ అన్నారు. కర్నూలులో పలు అభివృద్ధి కార్యక్రమాలకు ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆటో డ్రైవర్లతో మాట్లాడారు. ఆటో డ్రైవర్ల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని సీఎం చంద్రబాబు రూ.15 వేలు ఇవ్వడంతో వారు సంతోషం వ్యక్తం చేస్తున్నారన్నారు. కర్నూలును స్మార్ట్ సిటీ చేసేందుకు తాను కృషి చేస్తున్నానన్నారు. అనంతరం ఆటో నడిపి డ్రైవర్లను ఉత్సాహపరిచారు.
Similar News
News October 8, 2025
కర్నూలు నగరపాలక ఆరోగ్య శాఖ అధికారిగా విష్ణుమూర్తి

కర్నూలు నగర పాలక సంస్థ ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ విశ్వేశ్వర్ రెడ్డి బదిలీ అయ్యారు. ఆయన స్థానంలో అనంతపురం మున్సిపల్ కార్పొరేషన్‌లో ఆరోగ్య శాఖ అధికారిగా పనిచేస్తున్న విష్ణుమూర్తిని నియమించారు. మంగళవారం ఆయన నగరపాలకలోని తన ఛాంబర్‌లో బాధ్యతలు స్వీకరించారు. విష్ణుమూర్తికి పారిశుద్ధ్య విభాగం ఇన్‌స్పెక్టర్లు, సిబ్బంది అభినందనలు తెలిపారు.
News October 7, 2025
వాల్మీకి భవన్ నిర్మాణం కోసం రూ.కోటి ఇస్తా: మంత్రి టీజీ

వాల్మీకి భవన్ నిర్మాణం కోసం తన తరుఫున రూ.కోటి సహకారం అందిస్తానని మంత్రి టీజీ భరత్ తెలిపారు. కర్నూల్లో నిర్వహించిన వాల్మీకి జయంతి వేడుకల్లో ఆయన పాల్గొని ఈ విరాళం ప్రకటించారు. వాల్మీకిలను ఎస్టీ జాబితాలో చేర్చే ప్రక్రియ తమ నాయకుడు సీఎం చంద్రబాబుతోనే సాధ్యమవుతుందన్నారు. స్థిరమైన ప్రభుత్వం ఉంటేనే ప్రజల సమస్యలకు పరిష్కారం దొరుకుతుందని మంత్రి టీజీ భరత్ చెప్పారు.
News October 6, 2025
మట్టి మిద్దె కూలి ఐదేళ్ల బాలిక మృతి

మంత్రాలయం మండలం మాధవరంలో విషాదం చోటు చేసుకుంది. పాత మట్టి మిద్దె ఇల్లు అకస్మాత్తుగా కూలిపోవడంతో ఐదేళ్ల బాలిక లలిత సోమవారం మృతిచెందింది. ఇంట్లో నిద్రిస్తున్న కుటుంబ సభ్యుల్లో ముగ్గురు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. స్థానికులు మట్టి గడ్డలను తొలగించి వారిని రక్షించారు. బాలికను ఆస్పత్రికి తీసుకెళ్లగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. ఈ ఘటనపై కేసు నమోదైంది.