News October 7, 2025

జూబ్లీహిల్స్ బై పోల్స్.. టీడీపీ ఓటు బ్యాంకుపై నేతల ఆరా

image

జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ఇపుడు అందరి చూపూ ఓటు బ్యాంకుపైనే ఉంది. ఏయే పార్టీలకు ప్రజలు మద్దతిస్తారనే విషయంపైనే నాయకులు లెక్కలు వేసుకుంటున్నారు. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ నుంచి 2014లో మాగంటి గోపీనాథ్ విజయం సాధించారు. ఆ తరువాత బీఆర్ఎస్ నుంచి గెలుపొందారు. అయితే ఇంకా టీడీపీకి ఓటు బ్యాంకు ఉందని నాయకులు నమ్ముతున్నారు. సైకిల్ పార్టీకి ఎన్ని ఓట్లు ఉంటాయని ఆరా తీస్తున్నారు.

Similar News

News October 8, 2025

కంటోన్మెంట్ బోర్డు CEO బదిలీ.. నూతన CEOగా అర్వింద్

image

సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డు CEO మధుకర్ నాయక్ బదిలీ అయ్యారు. నూతన CEOగా అర్వింద్ కుమార్ ద్వివేది బాధ్యతలు చేపట్టనున్నారు. ఈ మేరకు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా డిఫెన్స్ మినిస్ట్రీ ఒక ప్రకటనను విడుదల చేసింది. ఇంత కాలం ఇక్కడ విధులు నిర్వహించిన మధుకర్ నాయక్ డిఫెన్స్ ఎస్టేట్, డిప్యూటీ డైరెక్టర్ జనరల్‌గా ఢిల్లీకి బదిలీపై వెళ్లనున్నారు.

News October 7, 2025

జూబ్లీహిల్స్: కాంగ్రెస్ పార్టీకి ద్వితీయ విజయం దక్కేనా!

image

జూబ్లీహిల్స్‌లో రెండో విజయం దక్కించుకునేందుకు కాంగ్రెస్ పార్టీ సర్వశక్తులూ ఒడ్డుతోంది. 2009లో నియోజకవర్గం ఏర్పడిన మొదటిసారే అక్కడ పాగా వేసింది. కాంగ్రెస్ పార్టీ నుంచి PJR కుమారుడు విష్ణువర్ధన్ రెడ్డి విజయం సాధించారు. అయితే ఆ తరువాత జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పట్టు నిలుపుకోలేకపోయింది. నియోజకవర్గంలో ఐదోసారి జరిగే ఈ ఎన్నికల్లో ద్వితీయ విజయం దక్కించుకుంటుందో.. లేదో చూడాలి.

News October 7, 2025

HYD: TGSRTC‌లో డ్రైవర్లు కావలెను

image

వాయు కాలుష్య నివారణలో భాగంగా సిటీలో ప్రభుత్వం ఎలక్ట్రిక్ బస్సులు ప్రవేశపెట్టింది. దశలవారీగా కొత్త ఎలక్ట్రిక్ బస్సులు ప్రజలకు అందుబాటులోకి వస్తున్నాయి. ఈ గ్రీన్ బస్సులను నడిపేందుకు TGSRTC డ్రైవర్ల నియామకం చేపట్టింది. ఆసక్తిగలవారు హెవీ డ్రైవింగ్ లైసెన్స్ డాక్యుమెంట్స్‌తో నేరుగా రాణిగంజ్ బస్ డిపో నందు జరిగే రిక్రూట్మెంట్ డ్రైవ్‌లో పాల్గొనాలని అధికారులు సూచించారు.
SHARE IT