News October 7, 2025
సిద్దిపేట: RRR భూసేకరణపై జిల్లా కలెక్టర్ సమీక్ష

సమీకృత జిల్లా కార్యాలయ సముదాయంలోని కలెక్టర్ ఛాంబర్ లో రీజనల్ రింగ్ రోడ్డు భూ సేకరణ ప్రక్రియ గూర్చి రెవెన్యూ అధికారులతో జిల్లా కలెక్టర్ కె. హైమావతి సమీక్ష నిర్వహించారు.ఈ సమీక్షలో జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.. ఆయా మండలాల వారిగా భూ సేకరణ వివరాల గూర్చి రెవెన్యూ అధికారులతో చర్చించి ఆయా గ్రామాల వారిగా ఒక పక్క ప్రణాళికతో భూ సేకరణ వేగవంతం చెయ్యాలని ఆదేశించారు.
Similar News
News April 1, 2026
VZM: తాగునీటి వేసవి ప్రణాళికపై కలెక్టర్ సమీక్ష

వేసవి కాలంలో గ్రామాలు, పాఠశాలలు, వసతి గృహాలు, అంగన్వాడీ కేంద్రాల్లో సురక్షిత తాగునీరు అందించాలని జిల్లా కలెక్టర్ ఎస్.రామ్ సుందర్ రెడ్డి అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్‌లో తాగునీటి వేసవి ప్రణాళికపై నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడారు. ఆర్‌ఓ ప్లాంట్లు లేని పాఠశాలలు, వసతి గృహాల జాబితా సిద్ధం చేసి అవసరమైన చోట జల జీవన్ మిషన్ ద్వారా కుళాయిల ఏర్పాటు అవకాశాలను పరిశీలించాలని సూచించారు.
News April 1, 2026
పెరిగిన ఇండిగో విమాన టికెట్ల ధరలు

విమాన ఇంధన ధరలు పెరిగిన నేపథ్యంలో ఆ భారాన్ని ప్రయాణికులపై మోపేందుకు ఇండిగో సిద్ధమైంది. ఏప్రిల్ 2 నుంచి టికెట్ బుకింగ్స్‌పై ఇంధన ఛార్జీలను సవరించనున్నట్లు ప్రకటించింది. దూరాన్ని బట్టి డొమెస్టిక్ ఫ్లైట్స్‌లో ₹275-₹950, ఇంటర్నేషనల్ సర్వీసులలో ₹900-₹10,000 వరకు ఫ్యూయల్ ఛార్జెస్ పెరుగుతాయని తెలిపింది. డొమెస్టిక్ ఎయిర్‌లైన్స్‌కు 25%, ఇంటర్నేషనల్ సర్వీసెస్‌పై 100% ఇంధన ధరలు పెరిగిన విషయం తెలిసిందే.
News April 1, 2026
ఆసిఫాబాద్: విషాదం.. పదోన్నతి పొందిన రోజే మృతి

విధి నిర్వహణలో నిమగ్నమై ఉన్న కాగజ్‌నగర్‌కు చెందిన అస్సాం రాష్ట్రం సశస్త్ర సీమా బల్(SSB) SI దినేష్ కుమార్ మండల్(43) బుధవారం అకస్మాత్తుగా కుప్పకూలి ప్రాణాలు విడిచారు. 2004లో విధుల్లో చేరిన ఆయన, బుధవారమే సీఐగా పదోన్నతి పొందారు. ఉన్నత బాధ్యతలు చేపట్టాల్సిన రోజే మృత్యువు కబళించడంతో కాగజ్‌నగర్‌లో విషాద ఛాయలు అలముకున్నాయి. పదోన్నతి పొందిన రోజే ఆయనను కోల్పోవడం శోచనీయమని తోటి సిబ్బంది ఆవేదన వ్యక్తం చేశారు.


