News October 7, 2025

ASF: పశువులను రోడ్లపై వదిలితే చర్యలు

image

ఆసిఫాబాద్ మున్సిపల్ కమిషనర్ గజానంద్ రోడ్లపైకి పశువులను వదిలే యజమానులకు సూచనలు చేశారు. పశువులను రాత్రిపూట, పగటిపూట రోడ్లపైన వదలకుండా చూసుకోవాలన్నారు. పశువులను రోడ్ల పైన వదలడం వలన ప్రమాదాలు జరుగుతున్నాయన్నారు. యజమానులు పశువులను వారి సంరక్షణలో ఉంచుకోవాలని లేని పక్షంలో జరిమానాలు విధించడంతో పాటు పురపాలక చట్టం 2019 ప్రకారం చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

Similar News

News October 8, 2025

మోహన్‌బాబు యూనివర్సిటీకి భారీ జరిమానా

image

AP: సినీ నటుడు మోహన్‌బాబుకు ఉన్నత విద్యా కమిషన్ షాకిచ్చింది. తిరుపతిలోని మోహన్‌బాబు యూనివర్సిటీలో మూడేళ్లుగా విద్యార్థుల నుంచి అదనంగా రూ.26 కోట్లు వసూలు చేసినట్లు వెల్లడించింది. 15 రోజుల్లోగా ఆ మొత్తాన్ని తిరిగి చెల్లించాలని ఆదేశించింది. విచారణ అనంతరం రూ.15 లక్షల జరిమానా విధించింది. యూనివర్సిటీ లైసెన్స్ రద్దు చేయాలని ప్రభుత్వానికి కమిషన్ సిఫారసు చేసింది.

News October 8, 2025

విషం తాగి ఆత్మహత్యాయత్నం.. ప్రాణాలు కాపాడిన పోలీస్

image

తంగళ్ళపల్లిలో మహేష్ అనే యువకుడు విషం తాగి ఆత్మహత్య చేసుకునేందుకు ప్రయత్నించగా పోలీసు సమయస్ఫూర్తితో ప్రాణాలు దక్కాయి. విషం తాగానని తల్లికి ఫోన్ చేసి చెప్పడంతో తల్లి వెంటనే డయల్ 100కు సమాచారం ఇచ్చారు. వెంటనే బ్లూ కోట్స్ కానిస్టేబుల్ ప్రశాంత్ మహేష్ ఫోన్ నంబర్‌ను ట్రేస్ చేశారు. అతడిని ఆసుపత్రికి తరలించగా ఎలాంటి ప్రమాదం లేదని వైద్యులు నిర్ధారించారు. కానిస్టేబుల్ ప్రశాంత్‌ను పలువురు అభినందించారు.

News October 8, 2025

నిండు చంద్రుడిని బంధించిన ఎండపల్లి యువకుడు

image

ఎండపల్లికి చెందిన మల్లేష్ తన మొబైల్‌తో నిండు పౌర్ణమి రాత్రి ఆకాశంలో మెరిసిన చంద్రుడిని అద్భుతంగా క్యాప్చర్ చేశాడు. చంద్రుడి ఉపరితలం స్పష్టంగా కనిపించేలా తీసిన ఈ అరుదైన ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. “మొబైల్‌తో ఇంత క్లారిటీనా!” అంటూ స్థానికులు, నెటిజన్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. మల్లేష్ ఫోటోగ్రఫీ ప్రతిభకు ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.