News October 7, 2025
ANU పరిధిలో సప్లమెంటరీ ఫలితాలు విడుదల

ANU పరిధిలో జులై 2025లో నిర్వహించిన పీజీ 2వ సెమిస్టర్ రెగ్యులర్, B.TECH సప్లమెంటరీ ఫలితాలను మంగళవారం పరీక్షల నిర్వహణ అధికారి ఆలపాటి శివప్రసాదరావు విడుదల చేశారు. పీజీ మాస్టర్ ఆఫ్ సోషల్ వర్క్ 84.62%, B.TECH 3&4 మొదటి సెమిస్టర్ లోని సప్లమెంటరీ ఫలితాలలో 65.91% విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారన్నారు. రీవాల్యుయేషన్ కి అక్టోబర్ 17లోపు ఒక్కొక్క సబ్జెక్ట్‌కు రూ.2,070 చెల్లించాలన్నారు.
Similar News
News October 8, 2025
మోహన్‌బాబు యూనివర్సిటీకి భారీ జరిమానా

AP: సినీ నటుడు మోహన్‌బాబుకు ఉన్నత విద్యా కమిషన్ షాకిచ్చింది. తిరుపతిలోని మోహన్‌బాబు యూనివర్సిటీలో మూడేళ్లుగా విద్యార్థుల నుంచి అదనంగా రూ.26 కోట్లు వసూలు చేసినట్లు వెల్లడించింది. 15 రోజుల్లోగా ఆ మొత్తాన్ని తిరిగి చెల్లించాలని ఆదేశించింది. విచారణ అనంతరం రూ.15 లక్షల జరిమానా విధించింది. యూనివర్సిటీ లైసెన్స్ రద్దు చేయాలని ప్రభుత్వానికి కమిషన్ సిఫారసు చేసింది.
News October 8, 2025
విషం తాగి ఆత్మహత్యాయత్నం.. ప్రాణాలు కాపాడిన పోలీస్

తంగళ్ళపల్లిలో మహేష్ అనే యువకుడు విషం తాగి ఆత్మహత్య చేసుకునేందుకు ప్రయత్నించగా పోలీసు సమయస్ఫూర్తితో ప్రాణాలు దక్కాయి. విషం తాగానని తల్లికి ఫోన్ చేసి చెప్పడంతో తల్లి వెంటనే డయల్ 100కు సమాచారం ఇచ్చారు. వెంటనే బ్లూ కోట్స్ కానిస్టేబుల్ ప్రశాంత్ మహేష్ ఫోన్ నంబర్‌ను ట్రేస్ చేశారు. అతడిని ఆసుపత్రికి తరలించగా ఎలాంటి ప్రమాదం లేదని వైద్యులు నిర్ధారించారు. కానిస్టేబుల్ ప్రశాంత్‌ను పలువురు అభినందించారు.
News October 8, 2025
నిండు చంద్రుడిని బంధించిన ఎండపల్లి యువకుడు

ఎండపల్లికి చెందిన మల్లేష్ తన మొబైల్‌తో నిండు పౌర్ణమి రాత్రి ఆకాశంలో మెరిసిన చంద్రుడిని అద్భుతంగా క్యాప్చర్ చేశాడు. చంద్రుడి ఉపరితలం స్పష్టంగా కనిపించేలా తీసిన ఈ అరుదైన ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. “మొబైల్‌తో ఇంత క్లారిటీనా!” అంటూ స్థానికులు, నెటిజన్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. మల్లేష్ ఫోటోగ్రఫీ ప్రతిభకు ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.