News April 7, 2024
హైదరాబాద్: రోడ్ల మీద చెత్త వేస్తే FINE
ఇంటింటి చెత్త సేకరణను 100% విజయవంతం చేయాలని జీహెచ్ఎంసీ కమిషనర్ రోనాల్డ్ రాస్ నగరవాసులకు సూచించారు. స్వచ్ఛ ఆటోలకు చెత్త ఇవ్వకుండా, రోడ్లపై పడేస్తే జరిమానా తప్పదని హెచ్చరించారు. వారం రోజుల బస్తీ కార్యాచరణతో సాధ్యమైన ఫలితాలను వివరిస్తూ ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. క్షేత్రస్థాయి సమావేశాలతో 1,87,752 ఇళ్ల యజమానులు స్వచ్ఛ ఆటోలకు చెత్త ఇవ్వట్లేదని.. ఇకనైనా మున్సిపల్ సిబ్బందికి సహకరించాలని పేర్కొన్నారు.
Similar News
News December 25, 2024
శంషాబాద్‌లో ఉపరాష్ట్రపతికి ఘన స్వాగతం
ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖడ్ దంపతులకు శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో మంత్రి జూపల్లి కృష్ణారావు ఘన స్వాగతం పలికారు. ఇక్కడి నుంచి మెదక్ జిల్లాలోని తునికిలోని ఐసీఏఆర్ విజ్ఞాన కేంద్రానికి షెడ్యూల్ ప్రత్యేక హెలికాప్టర్‌లో వెళ్లారు. విజ్ఞాన కేంద్రంలో సేంద్రియ పంటలు పండిస్తున్న సుమారు 500 మంది రైతులతో ఉపరాష్ట్రపతి మాట్లాడుతారు.
News December 25, 2024
HYD: సంపులో నాగు పాము (PHOTO)
సంపులో నాగు పాము ప్రత్యక్ష్యమైంది. స్థానికుల వివరాలు.. హైదర్‌షాకోట్ బైరాగిగూడలోని ఓ ఇంట్లో పాము దూరింది. ఒక్కసారిగా సంపులో పడిపోయింది. పైకి ఎక్కేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తూ పడగ విప్పి బుసలు కొట్టింది. భయాందోళనకు గురైన కుటుంబీకులు, స్థానికులు వెంటనే స్నేక్ సొసైటీకి సమాచారం అందించారు. అక్కడికి చేరుకున్న స్నేక్ క్యాచర్ చాకచాక్యంగా పామును పట్టుకొని, అక్కడి నుంచి తరలించారు.
News December 25, 2024
NEW YEAR: HYDలో రాత్రి 10 దాటితే బంద్!
రాజధానిలోని 3 కమిషనరేట్ల పరిధిలో న్యూ ఇయర్ వేడుకలపై పోలీసులు ఆంక్షలు విధించారు.
➤ఔట్‌డోర్‌లో రాత్రి 10 తర్వాత లౌడ్ స్పీకర్లు బంద్
➤ఈవెంట్లకు అనుమతి తప్పనిసరి
➤మైనర్లకు పార్టీల్లో నో ఎంట్రీ
➤ఇండోర్‌లోనే మ్యూజికల్ ఈవెంట్స్
➤సౌండ్ పొల్యూషన్ 45 డెసిబుల్స్ దాటొద్దు
➤అసభ్యకర డాన్సులు బ్యాన్
డ్రంకెన్ డ్రైవ్‌లో పట్టుబడితే రూ.10,000 FINE, 6 నెలల జైలు శిక్ష విధిస్తారు.
SHARE IT