News October 7, 2025
KNR: లోకల్ ఎలక్షన్స్ ముందు మంత్రుల పంచాయితీ ఏంటి?

అడ్లూరి లక్ష్మణ్‌పై పొన్నం ప్రభాకర్ చేసిన వ్యాఖ్యలు, అందుకు అడ్లూరి రియాక్షన్‌తో కాంగ్రెస్‌లో రాజకీయ దుమారం రేగుతోంది. గతంలో పొన్నం, శ్రీధర్ బాబు మధ్య ఆధిపత్యపోరు ఉండేది. దీంతో ప్రస్తుతం ఉమ్మడి జిల్లాలో మంత్రులు పొన్నం, వివేక్ వర్సెస్ శ్రీధర్ బాబు, అడ్లూరి లక్ష్మణ్‌గా సీన్ మారిందనే చర్చ మొదలైంది. అయితే స్థానిక ఎన్నికలు, జూబ్లీహిల్స్ బైపోల్ ముందు వీరి పంచాయితీ ఏంటని కేడర్ నారాజులో ఉంది.
Similar News
News March 20, 2026
భద్రాద్రి రాముడిపై వివాదం.. 23న హైకోర్టు విచారణ

భద్రాద్రి క్షేత్రంలో కొలువైన శ్రీరాముడు ‘దశరథ రాముడా’ లేదా ‘వైకుంఠ రాముడా’ అనే అంశంపై నెలకొన్న వివాదంపై ఈ నెల 23న హైకోర్టులో విచారణ జరగనుంది. దీనిపై స్పష్టత కోసం ప్రభుత్వం ఇప్పటికే ఐదుగురు పండితులతో కూడిన కమిటీని నియమించగా, వారు తమ నివేదికను ప్రభుత్వానికి సమర్పించారు. ఆ నివేదికలోని అంశాలపై ఇంకా తుది నిర్ణయం వెలువడలేదు. కోర్టు విచారణ అనంతరం ఈ వివాదానికి తెరపడే అవకాశం ఉందని భక్తులు భావిస్తున్నారు.
News March 20, 2026
నల్గొండ: 20 రోజుల్లోనే రూ.30 పెంపు.. బెంబేలెత్తుతున్న జనం

పశ్చిమాసియాలో కమ్ముకున్న యుద్ధ మేఘాలు జిల్లాలోని వంటింట్లో మంట పుట్టిస్తున్నాయి. ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధాన్ని సాకుగా చూపుతూ వ్యాపారులు వంట నూనెల ధరలను అడ్డగోలుగా పెంచేస్తున్నారు. జిల్లాలో గత 20 రోజుల్లోనే కిలో ప్యాకెట్‌పై ఏకంగా రూ.30 వరకు పెరగడం ప్రజలను ఆందోళనకు గురిచేస్తోంది. పామాయిల్ రూ.140కి చేరగా, పల్లీ నూనె రూ.175లకు విక్రయిస్తున్నారు. వ్యాపారులు కృత్రిమ కొరత సృష్టిస్తున్నారన్న విమర్శలున్నాయి.
News March 20, 2026
ఎన్నికల బరిలో హత్యాచార బాధితురాలి తల్లి!

బెంగాల్ ఆర్జీకర్ మెడికల్ కాలేజీలో <<15698320>>హత్యాచారానికి <<>>గురైన బాధితురాలి తల్లి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీకి సిద్ధమయ్యారు. పానీహటి నుంచి కంటెస్ట్ చేయాలనుకుంటున్నట్లు ఆమె వెల్లడించారు. గతంలో BJP తనకు టికెట్ ఆఫర్ చేసిందని చెప్పారు. ఇటీవల ఆ పార్టీ అభ్యర్థుల జాబితాను ప్రకటించగా పానీహటి సీటును పెండింగ్‌లో పెట్టింది. దీంతో ఆమెకే టికెట్ ఇవ్వనున్నట్లు ప్రచారం జరుగుతోంది. దీనిపై అధిష్ఠానం తుది నిర్ణయం తీసుకోనుంది.


