News October 7, 2025
ములుగు: పారా మెడికల్ కోర్సులకు నోటిఫికేషన్ విడుదల

ములుగు జిల్లా ప్రభుత్వ వైద్య కళాశాలలో పారా మెడికల్ కోర్సులకు నోటిఫికేషన్ విడుదలైందని ప్రిన్సిపల్ స్వర్ణకుమారి తెలిపారు. ఇంటర్మీడియట్ ఉత్తీర్ణులైన విద్యార్థులు 2025-26 విద్యా సంవత్సరానికి గాను డీఎంఎల్టీ, డీఎంఎస్ఓటీటీ కోర్సుల్లో చేరవచ్చాన్నారు. ఈనెల 28 సాయంత్రం లోపు జిల్లా వైద్య కళాశాలలో దరఖాస్తు చేసుకోవాలన్నారు.
Similar News
News March 21, 2026
దేశాన్ని అమ్మేశారు.. కేంద్రంపై మమత ఫైర్

ఇంధన ధరలు పెంచాలని కేంద్రం ప్లాన్ చేస్తోందని బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఆరోపించారు. దేశాన్ని అమ్మేశారని మండిపడ్డారు. ‘మన్మోహన్ హయాంలో గ్యాస్ సిలిండర్ ధర రూ.400 ఉండేది. ఇప్పుడు రూ.1,100 చేశారు. రానున్న రోజుల్లో మరింతగా పెరుగుతాయి’ అని చెప్పారు. మరోవైపు బెంగాల్‌లో అప్రకటిత రాష్ట్రపతి పాలన నడుస్తోందని ఫైరయ్యారు. ప్రధాని మోదీ నుంచి దేశాన్ని కాపాడటమే తనకు ప్రాధాన్యమని అన్నారు.
News March 21, 2026
సంగారెడ్డి: టెన్త్ పరీక్షలు పారదర్శకంగా నిర్వహించాలి: కలెక్టర్

జిల్లాలో పదవ తరగతి పరీక్షలు పారదర్శకంగా జరిగేలా చూడాలని కలెక్టర్ ప్రావీణ్య ఆదేశించారు. సంగారెడ్డి క్యాంపు కార్యాలయంలో ఎంఈఓలతో వీడియో కాన్ఫరెన్స్ శుక్రవారం నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ.. పరీక్ష కేంద్రాల్లోకి మొబైల్ ఫోన్స్ అనుమతి లేదని చెప్పారు. పరీక్షా కేంద్రంలో ఏ ఘటన జరిగిన చీఫ్ సూపరింటెండ్లు, ఎంఈవో లే బాధ్యత వహించాల్సి ఉంటుందని చెప్పారు. డీఈఓ వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.