News October 7, 2025
నల్గొండ: బాలికపై హత్యాచారం.. కఠిన చర్యలకు ఆదేశం

డైట్ స్కూల్ సమీపంలో మైనర్ బాలికపై హత్యాచారం జరగ్గా ఆ ప్రదేశాన్ని ఎస్పీ శరత్ చంద్ర పవార్ పరిశీలించారు. కేసు విచారణలో పురోగతి, సాక్ష్యాధారాల సేకరణ గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. నిందితుడిపై తక్షణమే పోక్సో చట్టం కింద కేసు నమోదు చేయాలని ఆదేశించారు. కఠిన చర్యలు తీసుకోవాలన్నారు.
Similar News
News October 8, 2025
స్మార్ట్ రేషన్ కార్డుల్లో తప్పులుంటే సవరణ చేసుకోవచ్చు: జేసీ

కొత్తగా వచ్చిన స్మార్ట్ రేషన్ కార్డుల్లో తప్పులుంటే సవరణ చేసుకోవచ్చని జాయింట్ కలెక్టర్ అభిషేక్ కుమార్ ఓ ప్రకటనలో తెలిపారు. సమీప గ్రామ, వార్డు సచివాలయాల వద్దకు వెళ్లి ఎలాంటి రుసుము లేకుండా దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. ఈనెల చివరి వరకు దరఖాస్తు చేసుకునేందుకు ప్రభుత్వం అవకాశం కల్పించిందన్నారు. స్వయంగా బయోమెట్రిక్ ద్వారా దరఖాస్తుదారులు ఈనెల 31వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చన్నారు.
News October 8, 2025
దసరా మహోత్సవం విజయవంతం: కలెక్టర్ లక్ష్మీశా

2025 సంవత్సరానికి సంబంధించి దసరా మహోత్సవాలు విజయవంతంగా నిర్వహించామని కలెక్టర్ లక్ష్మీశా, పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబు, మున్సిపల్ కమిషనర్ దాన్య చంద్ర అన్నారు. దసరా మహోత్సవంలో పాల్గొన్న అన్ని శాఖల అధికారులతో మంగళవారం సాయంత్రం విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో సమావేశం నిర్వహించారు. దసరా ఉత్సవాలు ఘనంగా నిర్వహించడానికి సహకరించిన అధికారులకు ప్రశంస పత్రాలు అందించి, అభినందనలు తెలిపారు.
News October 8, 2025
కర్నూలు నగరపాలక ఆరోగ్య శాఖ అధికారిగా విష్ణుమూర్తి

కర్నూలు నగర పాలక సంస్థ ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ విశ్వేశ్వర్ రెడ్డి బదిలీ అయ్యారు. ఆయన స్థానంలో అనంతపురం మున్సిపల్ కార్పొరేషన్‌లో ఆరోగ్య శాఖ అధికారిగా పనిచేస్తున్న విష్ణుమూర్తిని నియమించారు. మంగళవారం ఆయన నగరపాలకలోని తన ఛాంబర్‌లో బాధ్యతలు స్వీకరించారు. విష్ణుమూర్తికి పారిశుద్ధ్య విభాగం ఇన్‌స్పెక్టర్లు, సిబ్బంది అభినందనలు తెలిపారు.