News October 7, 2025
అమలాపురం: 81 మందికి ఉద్యోగ ఉత్తర్వులు అందజేత

నిరుద్యోగ యువత ప్రగతి కోసం ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు వికాస సంస్థ అవిరళ కృషి చేస్తోందని కలెక్టర్ మహేశ్ కుమార్ అన్నారు. మంగళవారం అమలాపురంలోని కలెక్టరేట్ వద్ద నిర్వహించిన మినీ జాబ్ మేళాలో సుమారు 123 మంది అభ్యర్థులు హాజరు కాగా వీరికి ముఖాముఖి ఇంటర్వ్యూలు, అర్హత ధ్రువ పత్రాల పరిశీలన చేశారు. 81 మందికి ఉద్యోగ ఉత్తర్వులను అందజేశారు. అధికారులు పాల్గొన్నారు.
Similar News
News March 28, 2026
ఇరాన్‌తో యుద్ధం.. ట్రంప్‌కు అమెరికన్ల షాక్

యుద్ధోన్మాదంతో చెలరేగుతున్న అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌కు సొంత ప్రజల్లో ఆదరణ దారుణంగా పడిపోయింది. ఫాక్స్ న్యూస్ పోల్ సర్వేలో ఆయన తీరుపట్ల 59% మంది ఓటర్లు అసంతృప్తి వ్యక్తం చేయగా, వీరిలో 47% మంది తీవ్రంగా వ్యతిరేకించారు. 41% మంది మాత్రమే ఆయనను సమర్థించారు. అలాగే ట్రంప్ విదేశాంగ విధానాన్ని ఏకంగా 62% మంది, ఇరాన్‌తో ఘర్షణల విషయంలో ఆయన తీరును 64% మంది తప్పుపట్టారు.
News March 28, 2026
ఆకివీడు ఆలయం వద్ద కంచె.. మోహరించిన బలగాలు

ఆకివీడు పెదపేటలోని శిథిలావస్థకు చేరిన ఆలయం వద్ద శ్రీరామనవమి నేపథ్యంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ముందస్తు జాగ్రత్త చర్యగా, భక్తులు లేదా ఇతర వ్యక్తులు ఎవరూ ఆలయం లోపలికి వెళ్లకుండా అధికారులు ఆలయం చుట్టూ ఇనుప కంచె (ఫెన్సింగ్) ఏర్పాటు చేశారు. పరిస్థితిని సమీక్షించేందుకు ఈ ప్రాంతంలో పోలీస్ పికెట్ కొనసాగుతోంది. భారీగా పోలీసు బలగాలు మోహరించి పటిష్ఠ బందోబస్తు నిర్వహిస్తున్నారు.
News March 28, 2026
ద్వారకాతిరుమల: నకిలీ టికెట్ల వ్యవహారంలో ఇద్దరి అరెస్టు

ద్వారకాతిరుమల చినవెంకన్న క్షేత్రంలో నకిలీ టికెట్ల వ్యవహారం కలకలం రేపింది. ఈ కేసులో ఇద్దరు ఉద్యోగులను పోలీసులు శుక్రవారం అరెస్ట్ చేశారు. అవుట్‌సోర్సింగ్ సిబ్బంది శేషుబాబు, సెక్యూరిటీ గార్డు సతీశ్‌ను అదుపులోకి తీసుకొని కోర్టులో హాజరుపర్చగా రిమాండ్ విధించారు. ప్రధాన నిందితుడు రాజు పరారీలో ఉన్నాడు. ఈ ఘటనలో 61 నకిలీ టికెట్లు బయటపడగా, అవి దేవస్థానం సాఫ్ట్‌వేర్‌కు సంబంధం లేనివని అధికారులు తెలిపారు.


