News October 7, 2025

హిందూపురంలో మెగా జాబ్ మేళా: కలెక్టర్

image

హిందూపురంలో అక్టోబర్ 10వ తేదీన మెగా జాబ్ మేళా నిర్వహిస్తున్నట్టు కలెక్టర్ శ్యాంప్రసాద్ తెలిపారు. మంగళవారం పుట్టపర్తి కలెక్టరేట్లో జాబ్ మేళాకు సంబంధించి నైపుణ్యాభివృద్ధి సంస్థ అధికారులతో కలిసి కలెక్టర్ పోస్టర్లను విడుదల చేశారు. SDGS ఎంబీఏ కళాశాలలో ఉదయం 9 గంటలకు జాబ్ మేళా జరుగుతుందన్నారు. ఇందులో 15 కంపెనీలు పాల్గొన్నట్లు తెలిపారు. నిరుద్యోగ యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.

Similar News

News March 12, 2026

‘సాగర్‌కు కొత్త దారి’.. అధికారులకు సీఎం ఆదేశం!

image

రోడ్లు, భవనాల శాఖపై సీఎం సమీక్ష నిర్వహించారు. జిల్లా మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి పాల్గొన్న ఈ భేటీలో సీఎం కీలక ఆదేశాలిచ్చారు. హైదరాబాద్-విజయవాడ ఎక్స్‌ప్రెస్ వే నుంచి నాగార్జునసాగర్‌కు త్వరితగతిన చేరుకునేలా నూతన గ్రీన్‌ఫీల్డ్ రహదారి నిర్మాణంపై అధ్యయనం చేయాలని స్పష్టం చేశారు. ఈ సరికొత్త రోడ్డు పూర్తయితే ట్రాఫిక్ కష్టాలు తీరి, సాగర్ పర్యాటకంతో పాటు ఉమ్మడి నల్గొండ జిల్లా ముఖచిత్రం మారనుంది.

News March 12, 2026

గుంటూరులో విషాదం

image

గుంటూరు కాకుమానువారితోటకు చెందిన 9వ తరగతి విద్యార్థి రాఘవ (14) మామిడికాయలు కోస్తూ ప్రమాదవశాత్తు బావిలో పడి మరణించాడు. మృతుని తండ్రి రాము ఫిర్యాదు మేరకు అరండల్ పేట పోలీసులు కేసు నమోదు చేశారు. రాఘవ తన స్నేహితులతో కలిసి ఆడుకోవడానికి వెళ్ళి అరండల్ పేట 8/4 లో మామిడి కాయలు కోస్తుండగా బావిలో పడ్డాడు. ఈ క్రమంలో ఊపిరాడక రాఘవ మృతిచెందాడని, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.

News March 12, 2026

పుట్టిన రోజు శుభాకాంక్షలు

image

ఈ రోజు పుట్టినరోజు జరుపుకొంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపరచండి.