News October 7, 2025

మాజీ ప్రధాని దేవెగౌడకు అస్వస్థత

image

మాజీ ప్రధాని HD దేవెగౌడ(92) అస్వస్థతకు గురయ్యారు. యూరినరీ ట్రాక్ట్ ఇన్‌ఫెక్షన్(UTI)తో బాధపడుతున్న ఆయనను నిన్న బెంగళూరులోని మణిపాల్ ఆసుపత్రిలో చేర్పించారు. చికిత్స అందించిన వైద్యులు.. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు తెలిపారు. ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నట్లు చెప్పారు.

Similar News

News October 8, 2025

శుభ సమయం (08-10-2025) బుధవారం

image

✒ తిథి: బహుళ పాడ్యమి ఉ.7.31 వరకు
✒ నక్షత్రం: అశ్విని రా.2.19 వరకు
✒ శుభ సమయం: ఉ.10.00-ఉ.10.30, సా.4.05-సా.5.05
✒ రాహుకాలం: మ.12.00-మ.1.30
✒ యమగండం: ఉ.7.30-ఉ.9.00
✒ దుర్ముహూర్తం: ఉ.11.36-మ.12.24
✒ వర్జ్యం: రా.10.32-రా.12.02
✒ అమృత ఘడియలు: రా.7.33-రా.9.03

News October 8, 2025

నేటి ముఖ్యాంశాలు

image

* సమర్థుడికే టీటీడీపీ అధ్యక్ష బాధ్యతలు: CBN
* బీసీ రిజర్వేషన్లపై సీనియర్ నేతలతో సీఎం రేవంత్ సుదీర్ఘ చర్చ
* గ్రూప్‌-1పై హైకోర్టు ఆదేశాలపై స్టేకు సుప్రీం నిరాకరణ
* కల్తీ మద్యం వెనుక ఉన్నదంతా బాబు అండ్ గ్యాంగే: జగన్
* జగన్ రోడ్ షోకు అనుమతి నిరాకరణ
* పొన్నం, అడ్లూరి వివాదం.. మాట్లాడి పరిష్కరిస్తానన్న TPCC చీఫ్

News October 8, 2025

రేపే తీర్పు.. సర్వత్రా ఉత్కంఠ

image

TGలో స్థానిక సంస్థల ఎన్నికలపై ఉత్కంఠకు రేపు తెర పడనుంది. ప్రభుత్వం బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించడాన్ని వ్యతిరేకిస్తూ దాఖలైన పిటిషన్‌పై హైకోర్టులో విచారణ జరగనుంది. పిటిషనర్ వాదనను సమర్థిస్తూ న్యాయస్థానం తీర్పిస్తే రిజర్వేషన్ల అమలు నిలిచిపోయే అవకాశం ఉంది. అదే జరిగితే పార్టీ తరఫున ఈ హామీని నెరవేరుస్తూ ఎన్నికలకు వెళ్లాలని సీఎం రేవంత్ రెడ్డి యోచిస్తున్నారు. మరి కోర్టు తీర్పు ఎలా వస్తుందో చూడాలి.