News October 7, 2025
HYD: తెలుగు వర్శిటీ ఫలితాలు విడుదల

తెలుగు యూనివర్సిటీ డిప్లొమా, సర్టిఫికెట్ కోర్సుల వార్షిక పరీక్షల ఫలితాలను విడుదల చేసినట్లు యూనివర్సిటీ అధికారులు తెలిపారు. 2024-25 విద్యా సంవత్సరానికి గానూ రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న 14 ప్రభుత్వ సంగీత, నృత్య పాఠశాలలు, కళాశాలల్లో జూన్ 2025లో పరీక్షలు నిర్వహించారు. ఫలితాలను www.teluguuniversity.ac.in వెబ్‌సైట్‌లో చూడవచ్చని వెల్లడించారు.
Similar News
News October 8, 2025
శుభ సమయం (08-10-2025) బుధవారం

✒ తిథి: బహుళ పాడ్యమి ఉ.7.31 వరకు
✒ నక్షత్రం: అశ్విని రా.2.19 వరకు
✒ శుభ సమయం: ఉ.10.00-ఉ.10.30, సా.4.05-సా.5.05
✒ రాహుకాలం: మ.12.00-మ.1.30
✒ యమగండం: ఉ.7.30-ఉ.9.00
✒ దుర్ముహూర్తం: ఉ.11.36-మ.12.24
✒ వర్జ్యం: రా.10.32-రా.12.02
✒ అమృత ఘడియలు: రా.7.33-రా.9.03
News October 8, 2025
అనకాపల్లి: వేతనదారులకు ముఖ ఆధారిత హాజరు

ఉపాధి హామీ పథకంలో పనిచేస్తున్న వేతన దారులకు ముఖ ఆధారిత హజరు అమలుకు చర్యలు తీసుకుంటున్నట్లు డ్వామా పీడీ పూర్ణిమా దేవి తెలిపారు. వేతనదారుని ముఖమును ఆధార్ కార్డులో ఉన్న ముఖముతో పోల్చి నమోదు చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఒకరికి బదులుగా మరొకరు పనిలోకి రాకుండా నియంత్రించినందుకు ఈ విధానాన్ని అమలులోకి తీసుకు వస్తున్నట్లు తెలిపారు. దీనిలో భాగంగా జిల్లాలో ప్రతి గ్రామంలోనూ E-KYC జరుగుతున్నట్లు తెలిపారు.
News October 8, 2025
ఎల్ఆర్ఎస్ పథకం కోసం VMRDA గ్రౌండ్ ఫ్లోర్లో హెల్ప్ డెస్క్

ఎల్ఆర్ఎస్ పథకం కోసం VMRDA గ్రౌండ్ ఫ్లోర్లో హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేశామని ఛైర్మన్ ప్రణవ్ గోపాల్ తెలిపారు. ఈనెల 31 లోపు దరఖాస్తు చేసుకోవాలన్నారు. ప్రభుత్వం ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ ఏడాది జూన్ 30 లోపు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారు ఈ పథకం కింద తమ స్థలాలను క్రమబద్ధీకరించుకోవచ్చని అన్నారు. దీనివల్ల భవన నిర్మాణ అనుమతులు, బ్యాంకు రుణాలు పొందవచ్చని పేర్కొన్నారు.