News April 7, 2024

కర్నూలు: డిగ్రీ 3, 5 సెమిస్టర్ ఫలితాలు విడుదల

image

రాయలసీమ విశ్వవిద్యాలయం పరిధిలో డిగ్రీ 3, 5వ సెమిస్టర్ పరీక్షల ఫలితాలను VCసుధీర్ ప్రేమ్కుమార్ ఆదేశాలతో విడుదల చేసినట్లు కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ వెంకటేశ్వర్లు తెలిపారు. 3 సెమిస్టర్లో రెగ్యులర్ విద్యార్థులు 5,900 మందికిగాను 3,081 మంది, సప్లిమెంటరీ విద్యార్థులు 9,140 మందికి 4,182 మంది ఉత్తీర్ణత సాధించారని తెలిపారు. ఫలితాలు rayalaseemauniversity.ac.in వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉన్నాయన్నారు.

Similar News

News September 30, 2024

రేపు పత్తికొండకు CM.. ఏర్పాట్లు పరిశీలించిన కలెక్టర్, ఎస్పీ

image

ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో భాగంగా పత్తికొండ మండలం పుచ్చకాయలమడ గ్రామానికి రేపు సీఎం చంద్రబాబు నాయుడు రానున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ పి.రంజిత్ బాషా, ఎస్పీ జి.బిందు మాధవ్ అడ్వాన్స్ సెక్యూరిటీ లైజన్‌లో భాగంగా ఆదివారం పుచ్చకాయలమడలో హెలిప్యాడ్, భద్రతా ఏర్పాట్లను పరిశీలించారు. సీఎం పర్యటనకు పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని సంబంధిత అధికారులను కలెక్టర్, ఎస్పీ ఆదేశించారు.

News September 30, 2024

నంద్యాలలో నేడు ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక

image

నంద్యాలలోని కలెక్టరేట్ సెంటినరీ హాలులో సోమవారం ‘ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక (PGRS)’ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్‌ రాజకుమారి తెలిపారు. ఉదయం 9-30 గంటలకు జిల్లాధికారులందరూ హాజరు కావాలని కలెక్టర్ పేర్కొన్నారు. ప్రజల నుంచి అర్జీలు స్వీకరిస్తామని చెప్పారు. ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

News September 29, 2024

వెల్దుర్తి: రైలు కిందపడి వ్యక్తి మృతి

image

రైలు కిందపడి వ్యక్తి మృతి చెందిన ఘటన వెల్దుర్తిలో చోటుచేసుకుంది. పట్టణంలోని డోన్ రైల్వే గేట్ల సమీపంలో ఉన్న ఈద్గా వద్ద కాచిగూడ నుంచి యశ్వంతపూర్ వెళుతున్న వందే భారత్ రైలు కింద మస్తాన్ వలి (74) పడడంతో శరీర భాగాలు ఛిద్రమయ్యాయి. కర్నూలు రైల్వే పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పరిశీలించారు. పోస్టుమార్టం నిమిత్తం వెల్దుర్తి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.