News October 7, 2025

నవీన్ యాదవ్‌పై సోదరుడి భార్య సంచలన లేఖ

image

TG: జూబ్లీహిల్స్ బైపోల్‌లో INC అభ్యర్థి రేసులో ఉన్న నవీన్ యాదవ్‌కు మరో షాక్ తగిలింది. భర్తతో పాటు కుటుంబీకులు తనను వేధిస్తున్నారంటూ నవీన్ సోదరుడు వెంకట్ భార్య మహితాశ్రీ మీనాక్షీ నటరాజన్‌కు రాసిన లేఖ SMలో వైరల్ అవుతోంది. రౌడీషీటర్ బ్యాక్‌డ్రాప్ ఉన్న నవీన్‌ లాంటివారికి రాజకీయాల్లో స్థానం కల్పించడంతో ప్రజలకు ముప్పు వాటిల్లుతుందన్నారు. ఓటర్ కార్డులు పంచారని <<17935833>>ఇప్పటికే<<>> నవీన్‌పై క్రిమినల్ కేసు నమోదైంది.

Similar News

News October 8, 2025

పుట్టినరోజు శుభాకాంక్షలు

image

ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.

News October 8, 2025

ఈ రోజు నమాజ్ వేళలు (అక్టోబర్ 08, బుధవారం)

image

✒ ఫజర్: తెల్లవారుజామున 4.55 గంటలకు
✒ సూర్యోదయం: ఉదయం 6.08 గంటలకు
✒ దుహర్: మధ్యాహ్నం 12.04 గంటలకు
✒ అసర్: సాయంత్రం 4.21 గంటలకు
✒ మఘ్రిబ్: సాయంత్రం 5.59 గంటలకు
✒ ఇష: రాత్రి 7.12 గంటలకు
✒ NOTE: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.

News October 8, 2025

ఇంద్రకీలాద్రి ఆలయానికి రూ.10.30కోట్ల ఆదాయం

image

AP: విజయవాడ ఇంద్రకీలాద్రి ఆలయానికి దసరా నవరాత్రుల సందర్భంగా వచ్చిన హుండీ ఆదాయాన్ని అధికారులు లెక్కించారు. 11 రోజుల్లో రూ.10.30 కోట్ల ఆదాయం వచ్చినట్లు తెలిపారు. గత ఏడాది రూ.9.32 కోట్లు రాగా, ఈసారి రూ.కోటి పెరిగింది. అంతే కాకుండా 387 గ్రాముల బంగారం, 19 కేజీల 450 గ్రాముల వెండిని భక్తులు అమ్మవారికి హుండీ కానుకగా సమర్పించినట్లు అధికారులు వెల్లడించారు.