News October 7, 2025
SV జూ పార్క్‌లో జాగ్వార్ మృతి.!

తిరుపతిలోని SV జూ పార్కులో పదిహేనేళ్ల మగ జాగ్వార్ కుశ మృతి చెందింది. 2019లో హైదరాబాదులోని నెహ్రూ జూలాజికల్ పార్క్ నుంచి బదిలీపై ఎస్వీ జూ పార్కుకు వచ్చింది. కాగా ఎప్పటిలాగే దానిని జూ ఆవరణంలోకి వదిలగా దురదృష్టవశాత్తు ఒక చెట్టుకు చిక్కుకుపోయి మృతి చెందింది. ఎస్వీ వెటర్నరీ విశ్వవిద్యాలయంలో పోస్ట్‌మార్టం నిర్వహించి ఖననం చేశారు. మృతికి కారణం హైపర్ వాల్మీకి షాక్, ఆస్పిక్స్యా అని వైద్యులు నిర్ధారించారు.
Similar News
News March 4, 2026
తిరుపతి కలెక్టర్‌ను కలిసిన ఖాదీ బోర్డు ఛైర్మన్

తిరుపతి కలెక్టర్ డా.ఎస్.వెంకటేశ్వర్‌ను ఏపీ ఖాదీ, విలేజ్ ఇండస్ట్రీస్ బోర్డు ఛైర్మన్ కెకె చౌదరి మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా జిల్లాలో ఖాదీ గ్రామీణ పరిశ్రమల అభివృద్ధి, ఉపాధి అవకాశాల విస్తరణపై చర్చించినట్లు సమాచారం. జిల్లా అభివృద్ధికి పరస్పర సహకారంతో ముందుకు సాగాలని వారు అభిప్రాయపడ్డారు.
News March 4, 2026
నిర్మల్‌లో వందరోజుల కార్యక్రమం ప్రారంభం

బాల్యవివాహాల నిర్మూలనకు జిల్లా యంత్రాంగం 100 రోజుల కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. జిల్లాలో బాల్యవివాహాలను పూర్తిగా నిర్మూలించాలని ఉద్దేశంతో బాల్య వివాహ రహిత భారత్ కార్యక్రమంలో భాగంగా సంబంధిత అధికారులు ప్రచార రథం ద్వారా జిల్లాలోని అన్ని గ్రామాలు విద్యాసంస్థలలో విస్తృత అవగాహన కల్పించనున్నారు. 18,21 సంవత్సరాలు లోపు బాల బాలికలకు వివాహం చేయడం చట్టరీత్యా నేరమని జరిగే పరిణామాలను వివరించనున్నారు.
News March 4, 2026
సంగారెడ్డి: పరీక్షకు 97.66% హాజరు

సంగారెడ్డి జిల్లావ్యాప్తంగా 53 పరీక్ష కేంద్రాల్లో బుధవారం జరిగిన ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం పరీక్షలు ప్రశాంతంగా ముగిశాయి. 16,959 మంది విద్యార్థులకు గాను 16,562 మంది (97.66%) హాజరయ్యారని, 397 మంది విద్యార్థులు గైర్హాజరైనట్లు ఇంటర్మీడియట్ విద్యాధికారి గోవింద్ రామ్ తెలిపారు. పరీక్షా కేంద్రాల వద్ద పటిష్ఠ నిఘా ఏర్పాటు చేశామని, విద్యార్థులు ఎలాంటి ఇబ్బందులు లేకుండా పరీక్షలు రాశారని పేర్కొన్నారు.


