News October 7, 2025

వరంగల్ పరిధిలో 23 ట్రాఫిక్ ఉల్లంఘన కేసులు నమోదు

image

వరంగల్ ట్రాఫిక్ పోలీసులు చేపట్టిన తనిఖీల్లో 23 ట్రాఫిక్ ఉల్లంఘన కేసులు నమోదయ్యాయి. సోమవారం నిర్వహించిన డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల్లో పట్టుబడ్డ 22 మందితో పాటు డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా వాహనం నడిపిన ఒకరు పట్టుబడినట్లు ట్రాఫిక్ ఇన్‌స్పెక్టర్ సుజాత తెలిపారు. వీరందరికీ కోర్టు జరిమానా విధించిందన్నారు. వాహనదారులు తప్పనిసరిగా ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని, లేకపోతే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

Similar News

News October 8, 2025

సినీ ముచ్చట్లు

image

* ఫన్ కోసం ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ చూస్తుంటా. చాలా క్రియేటివ్‌గా ఉంటాయి. ట్విటర్‌లో మొత్తం నెగెటివిటీ ఉంటుంది. అందుకే దూరంగా ఉంటా: ‘మాస్ జాతర’ ఇంటర్వ్యూలో రవితేజ
* ‘జాతిరత్నాలు’ అనుదీప్ దర్శకత్వంలో విశ్వక్‌సేన్ నటిస్తున్న ‘ఫంకీ’ మూవీ టీజర్ ఈ నెల 10న విడుదల
* యాక్టర్స్ పేరింగ్‌పై ట్రోల్స్.. రవితేజతో పనిచేయడం కంఫర్టబుల్‌గా ఉందన్న శ్రీలీల
* OCT 9న ప్రదీప్ రంగనాథన్ ‘డ్యూడ్’ సినిమా ట్రైలర్

News October 8, 2025

WNP: పెండింగ్ కేసులు త్వరగా పరిష్కరించాలి: ఎస్పీ

image

వనపర్తి జిల్లా ఎస్పీ గిరిధర్ మంగళవారం జిల్లా పోలీసు కార్యాలయంలో కోర్టు డ్యూటీ ఆఫీసర్లతో సమావేశం నిర్వహించారు. కోర్టు కేసుల్లో నిందితులకు శిక్షలు పడితేనే నేరాల నియంత్రణ సాధ్యమవుతుందని ఎస్పీ అన్నారు. కేసులు పెండింగ్‌లో లేకుండా త్వరగా పరిష్కరించి, నిందితులకు శిక్ష పడేలా కృషి చేయాలని ఆయన అధికారులను ఆదేశించారు.

News October 8, 2025

MBNR: ఎన్నికల నిబంధనలపై అవగాహన ఉండాలి: కలెక్టర్

image

మహబూబ్‌నగర్ జిల్లా కలెక్టర్ విజయేందిర బోయి మంగళవారం ఎన్నికల ప్రొసీడింగ్ అధికారులకు నిర్వహించిన శిక్షణ కార్యక్రమంలో పాల్గొన్నారు. స్థానిక సంస్థల ఎన్నికలు ఎటువంటి ఇబ్బందులు లేకుండా సజావుగా జరిగేందుకు కృషి చేయాలని కోరారు. ఎన్నికల నిర్వహణకు సంబంధించిన నిబంధనలపై అధికారులకు పూర్తి అవగాహన తప్పనిసరి అని ఆమె పేర్కొన్నారు.