News October 7, 2025
అంబేడ్కర్ విగ్రహ ధ్వంసం వైసీపీ పనే: ఎమ్మెల్యే నక్కా

అంబేడ్కర్ విగ్రహాన్ని వైసీపీనే ధ్వంసం చేసి, ప్రభుత్వంపై బురద జల్లేందుకు తాడేపల్లి ప్యాలెస్ నుంచి కుట్రలు చేస్తున్నారని ఎమ్మెల్యే నక్కా ఆనంద్ బాబు ఆరోపించారు. మంగళగిరిలో ఆయన మాట్లాడారు. దళితులంటే జగన్కు ఎందుకు అంత చిన్నచూపని ఆయన ప్రశ్నించారు. దళితుడైన సింగయ్యపై కారు ఎక్కించి చంపిన క్రూర స్వభావి జగన్ అన్నారు. రాజ్యాంగాన్ని లెక్కచేయని వైసీపీని రాష్ట్రం నుంచి బాయికాట్ చేయాలని ఆయన డిమాండ్ చేశారు.
Similar News
News October 7, 2025
కల్తీ మద్యానికి కర్త, కర్మ, క్రియ అంతా జగనే: పీతల సుజాత

పురాణాల్లో దేవుళ్లు మంచి పనులు చేస్తుంటే రాక్షసులు అడ్డుపడినట్టు, సీఎం చంద్రబాబు మంచి పనులు చేస్తుంటే జగన్ అడ్డుపడుతున్నాడని ఏపీ డబ్ల్యూసీఎఫ్సీ ఛైర్మన్ పీతల సుజాత మండిపడ్డారు. మంగళవారం మంగళగిరి టీడీపీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో ఆర్థిక ఇబ్బందులు ఉన్నా సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నామని తెలిపారు. స్త్రీశక్తి పథకం ద్వారా మహిళల అభ్యున్నతికి టీడీపీ ప్రభుత్వం కృషి చేస్తోందని చెప్పారు.
News October 7, 2025
వాల్మీకి నివాళులర్పించిన వైఎస్ జగన్

మహర్షి వాల్మీకి జయంతిని పురస్కరించుకుని తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో మంగళవారం మాజీ ముఖ్యమంత్రి, పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.
ఈ కార్యక్రమంలో మాజీ మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఉషా శ్రీచరణ్, మేరుగ నాగార్జున సహా పలువురు సీనియర్ నాయకులు పాల్గొన్నారు.
News October 7, 2025
గుంటూరుకు 5 రాష్ట్రస్థాయి అవార్డులు

గుంటూరు వెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో సోమవారం జరిగిన కార్యక్రమంలో జిల్లాకు 5 రాష్ట్ర స్థాయి, 48 జిల్లా స్థాయి స్వచ్ఛ అవార్డులను కలెక్టర్ తమీమ్ అన్సారియా ప్రదానం చేశారు. ఘన, ద్రవ వ్యర్థాల నిర్వహణ, ప్లాస్టిక్ నిషేధం వంటి అంశాల్లో అసాధారణ కృషి చేసినవారికి ఈ అవార్డులు ఇచ్చారు. ఎమ్మెల్యే రామాంజనేయులు మాట్లాడుతూ, సీఎం చంద్రబాబు 36 లక్షల మరుగుదొడ్లు నిర్మించి, చెత్త నుంచి సంపద సృష్టించారని కొనియాడారు.