News October 7, 2025
అమలాపురం: విద్యార్థులకు జీఎస్టీ పై వ్యాసరచన పోటీలు

జీఎస్టీ వార్షికోత్సవాల సందర్భంగా అమలాపురం మున్సిపల్ మహాత్మా గాంధీ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు వ్యాసరచన పోటీలు నిర్వహించారు. కోనసీమ జిల్లాకు చెందిన 22 మండలాల పాఠశాలల విద్యార్థులు ఈ పోటీల్లో పాల్గొన్నారు. హెచ్‌ఎం గణ సత్యనారాయణ ఆధ్వర్యంలో జరిగిన ఈ పోటీలను డీఈవో సలీం భాష, డిప్యూటీ కలెక్టర్ జి. మమ్మీ, ఐటీ అధికారి రవికాంత్ పర్యవేక్షించారు.
Similar News
News March 24, 2026
రాష్ట్రస్థాయి ఫుట్బాల్ సెలక్షన్స్ ట్రయల్స్

తెలంగాణ ఫుట్‌బాల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో త్వరలో అండర్-20 రాష్ట్రస్థాయి ఫుట్బాల్ సెలక్షన్స్ నిర్వహించనున్నట్లు కార్యదర్శి గిరిబాబు తెలిపారు. హైదరాబాద్‌లోని జింఖానా గ్రౌండ్స్‌లో ఈనెల 25 నుంచి ట్రయల్స్ జరగనున్నాయి. 2007-09 మధ్య జన్మించిన ఉమ్మడి నల్గొండ జిల్లా క్రీడాకారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఆసక్తి గల మెరుగైన ప్లేయర్లు సిద్ధంగా ఉండాలని సూచించారు.
News March 24, 2026
సామాన్యుడి వంటింట్లో పశ్చిమాసియా చిచ్చు..!

పశ్చిమాసియాలో నెలకొన్న యుద్ధ మేఘాలు సామాన్యుడి వంట గదిని గుల్ల చేస్తున్నాయి. జనవరి నుంచి క్రమంగా పెరుగుతూ వస్తున్న ధరలు, మార్చి నాటికి భగ్గుమన్నాయి. సరఫరా గొలుసు దెబ్బతినడంతో లీటర్ సన్‌ఫ్లవర్ నూనె 175కు చేరగా, పామాయిల్ 145 వద్ద రికార్డు స్థాయిని తాకింది. నెల రోజుల్లోనే సన్‌ఫ్లవర్ ఆయిల్ పై 21 పెరగడం గమనార్హం. రానున్న రోజుల్లో ధరలు మరింత పెరిగే సూచనలు కనిపిస్తుండటంతో సామాన్యులు ఆందోళన చెందుతున్నారు.
News March 24, 2026
IPL: అత్యల్ప స్కోరు ఆర్సీబీదే!

ఇండియన్ ప్రీమియర్ లీగ్ చరిత్రలో అత్యధిక స్కోరు(287) రికార్డు సన్ రైజర్స్ హైదరాబాద్ పేరిట <<19457522>>ఉంటే<<>>.. అత్యల్ప స్కోర్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు నమోదు చేసింది. 2017లో కోల్‌కతా(KKR)పై బెంగళూరు (RCB) చేసిన 49 రన్స్ నేటికీ లీగ్ చరిత్రలో అత్యల్పం. ఆ తర్వాత వరుసగా రాజస్థాన్ రాయల్స్ (58, 59), ఢిల్లీ (66, 67) పరుగులతో ఉన్నాయి. 2008లో ముంబై బౌలర్ల ధాటికి KKR కూడా 67 పరుగులకే కుప్పకూలింది.


