News October 7, 2025

మామిడికుదురు: జిల్లా స్థాయి జీఎస్టీ పోటీల్లో విద్యార్థి ప్రతిభ

image

మామిడికుదురు జడ్పీహెచ్ స్కూలుకు చెందిన ఎనిమిదో తరగతి విద్యార్థిని చింతలపూడి అలివేలు మంగతాయారు కోనసీమ జిల్లా స్థాయి జీఎస్టీ పోటీల్లో జూనియర్స్ విభాగంలో మొదటి స్థానం సాధించింది. అమలాపురం మునిసిపల్ హైస్కూల్‌లో ఈ పోటీలు మంగళవారం జరిగాయి. మొదటి స్థానంలో నిలిచిన మంగతాయారుకు DEO ఎస్కే భాష బహుమతిని అందించారు. ఆమెను అభినందించారు. ఆమెకు గైడ్ టీచరుగా వ్యవహరించిన గంగాభవానిని అభినందించారు.

Similar News

News March 8, 2026

KMR: పదో తరగతి విద్యార్థులకు మోటివేషన్ కార్యక్రమం: డీఈవో

image

పదో తరగతి విద్యార్థులు మంచి ఫలితాలు సాధించేందుకు విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ యోగితారాణా, కమిషనర్ నవీన్ నికోలస్ సోమవారం ఉదయం 10.30 నుంచి 12.30గం.ల వరకు T-SAT ద్వారా మోటివేషనల్ కార్యక్రమం నిర్వహించనున్నట్లు డీఈవో రాజు తెలిపారు. ఈ కార్యక్రమాన్ని విద్యార్థులు వీక్షించేలా జిల్లాలోని అన్ని పాఠశాలల ప్రధానోపాధ్యాయులు చర్యలు చేపట్టాలని సూచించారు. విద్యాధికారులు ఆయా పాఠశాలను పర్యవేక్షించాలన్నారు.

News March 8, 2026

వనపర్తి: వ్యభిచార గృహంపై దాడి.. ఆరుగురి అరెస్ట్

image

వ్యభిచార గృహంపై దాడి చేసిన ఘటన వనపర్తి పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసుల వివరాలు.. వనపర్తి పట్టణంలోని కేడిఆర్ నగర్‌కు చెందిన నారమ్మ, బాలస్వామి, రమేశ్‌లు కలిసి ఓ ఇంట్లో మహిళల చేత వ్యభిచారం నిర్వహిస్తున్నారు. విశ్వసనీయ సమాచారం మేరకు పట్టణ పోలీసులు వ్యభిచార గృహంపై దాడి చేసి ఆరుగురిని అరెస్టు చేసి కేసు నమోదు చేశారు. 

News March 8, 2026

6 నెలల పాటు యుద్ధానికి సిద్ధం: IRGC

image

ఇరాన్-ఇజ్రాయెల్, US యుద్ధం ఇప్పట్లో ముగిసేలా లేదు. 6 నెలల పాటు యుద్ధం చేయడానికి సిద్ధంగా ఉన్నామని ఇరాన్ ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్ కార్ప్స్(IRGC) స్టేట్ మీడియాకు వెల్లడించింది. ఇక అమెరికాతో యుద్ధంపై చర్చలకు వెళ్లబోమని ఇరాన్ ప్రకటించడంపై ట్రంప్ స్పందించారు. ఆ దేశంపై దాడులు మరింత తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. అటు శనివారం 300 లక్ష్యాలపై దాడులు చేసినట్లు ఇజ్రాయెల్ ప్రకటించింది.