News October 8, 2025
ఆటో డ్రైవర్ల పట్ల కాంగ్రెస్ నిర్లక్ష్యం: కేటీఆర్

ఆటో డ్రైవర్లకు ఇచ్చిన హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం విస్మరించి మోసపూరితంగా వ్యవహరిస్తోందని BRS వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు. ఆర్థిక ఇబ్బందులతో ఆత్మహత్యాయత్నం చేసిన అడవి పదిర గ్రామానికి చెందిన ఆటో డ్రైవర్ నాంపల్లి సతీష్‌ను కేటీఆర్ పరామర్శించారు. రాష్ట్రంలో ఆర్థిక సమస్యలతో చనిపోయిన 93 మందికి పైగా ఆటో డ్రైవర్ల సమాచారాన్ని ప్రభుత్వానికి అందించినా వారిని ఆదుకోవడంలో ప్రభుత్వం విఫలమైందన్నారు.
Similar News
News March 18, 2026
అన్నదాత సుఖీభవ హామీ ఎక్కడ: చిన్న శ్రీను

కూటమి ప్రభుత్వం ఎన్నికల హామీలను నెరవేర్చడంలో పూర్తిగా విఫలమైందని వైసీపీ జిల్లా అధ్యక్షుడు మజ్జి శ్రీనివాసరావు విమర్శించారు. బుధవారం విజయనగరంలోని ధర్మపురి కార్యాలయంలో జరిగిన పత్రికా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఐదేళ్లలో బొత్స సత్యనారాయణ ఆశీస్సులతో జిల్లాలో ఎంతో అభివృద్ధి జరిగిందని అన్నారు. అయితే ప్రస్తుత ప్రభుత్వం ‘అన్నదాత సుఖీభవ’ వంటి హామీలను నెరవేర్చడంలో విఫలమైందన్నారు.
News March 18, 2026
ఎన్టీఆర్ జిల్లాలో ప్రశాంతంగా పదో తరగతి పరీక్షలు

ఎన్టీఆర్ జిల్లాలో పదో తరగతి రెండో పరీక్ష బుధవారం ప్రశాంతంగా ముగిసింది. జిల్లా వ్యాప్తంగా 149 కేంద్రాల్లో నిర్వహించిన ఈ పరీక్షకు మొత్తం 27,215 మంది విద్యార్థులకు గాను 26,951 మంది హాజరయ్యారు. కాగా, 264 మంది గైర్హాజరైనట్లు డీఈఓ చంద్రకళ వెల్లడించారు. జిల్లాలో 99.03 శాతం హాజరు నమోదైందని, ఎక్కడా మాల్‌ప్రాక్టీస్ లేదా అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పకడ్బందీగా పరీక్షలు నిర్వహించినట్లు ఆమె స్పష్టం చేశారు.
News March 18, 2026
VJA: సిట్ కార్యాలయంలో అవినాశ్ రెడ్డిని ప్రశ్నిస్తున్న అధికారులు

మద్యం కేసులో ఏ-7 నిందితుడిగా ఉన్న ముప్పిడి అవినాశ్ రెడ్డిని గురువారం విజయవాడలోని సిట్ కార్యాలయంలో పోలీసులు విచారిస్తున్నారు. అవినాశ్ రెడ్డికి విధించిన 3 రోజుల కస్టడీ నేటితో ముగియనుండగా.. గుంటూరు జిల్లా జైలు నుంచి అతడిని విజయవాడకు రప్పించిన అధికారులు విచారణ చేస్తున్నారు. కాగా మద్యం కేసులో ఏ-1గా ఉన్న రాజ్ కేసిరెడ్డికి, అవినాశ్ రెడ్డి సమీప బంధువు.


